- లక్షల విలువ గల కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అగ్నికి ఆహుతి
తెలంగాణ రాష్ర్టం కరీంనగర్‌లో విద్యుత్ కార్యాలయంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్షల విలువైన కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల్లోకి వెళితే…. కరీంనగర్‌లోని ఎన్‌పిడిసిఎల్ కార్యాలయ సమీపంలోని విద్యుత్ సామాగ్రి స్టోర్‌లో ఆకస్మాత్తుగా మంటలె చెలరెగాయి. అక్కడనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. విద్యుత్ షాట్ సర్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం పరిస్థితి అంతా అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు కాలిబూడిదవడంతో విద్యుత్ శాఖకు భారీగా ఆస్తినష్టం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఈ దురదృష్టకర ప్రమాద సంఘటన తెలుసుకున్న మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి తదిరులు ప్రమాద స్థలానికి చేరుకొని ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలక్ర్టిసిటి స్టోర్ రూమ్ పక్కన విద్యుత్ వైర్లు ఉండడం వల్ల షాట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయని విద్యుత్ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు మంత్రి ఆదేశించినట్లు సమాచారం.
ఏదేమైనా వారం రోజుల క్రితమే శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అతిపెద్ద, ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. 9 మంది మృతి విద్యుత్ అధికారులు చెందారు. ఆ ఘటన మరవకముందే కరీంనగర్‌లో మరో విద్యుత్ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం.
ఐపీఎల్ (2020)కు సురేశ్ రైనా దూరం