హైదరాబాద్ కూకట్‌పల్లిలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన హాస్పిటల్ సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. రోగులను హుటాహటీనా వేరే ఆసుపత్రులకు తరించారు. షాట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభించిందని అధికారులు భావిస్తున్నారు. ఫైర్ సిబ్బంది 5 ఫైరింజన్‌లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. 20 అంబులెన్సులను ఆసుపత్రి వద్ద సిద్దంగా ఉంచారు. స్థానికుల సహాయంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి.