- శ్రీకాకుళం నుండి విజయవాడ వస్తున్న ప్రైవేటు బస్సు
- బస్సు వెనకభాగంలో చెలరేగిన మంటలు
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుం నుండి విజయవాడ వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే బస్ డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం నుండి ప్రయాణీకులు బయటపడ్డారు. విజయవాడ శివారులోని ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. బస్సు వెనకభాగం నుండి ఒక్కసారిగా మంటలు రావడంతో డ్రైవర్ ఇది గమనించి ప్రయాణీకులను దింపి వేశాడు.
అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానాకి చేరుకొని మంటలు ఆర్పివేశారు. చాలా సేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణీకులకు వేరే ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసి వారిని పంపించివేశారు.
Also Read…