వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా టపాసులు అమ్మడం, వినియోగించడాన్ని నిషేదిస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. దీపావళి పర్వదినాన బాణసంచా కాల్చడం ద్వారా వాయు కాలుష్యంతో పాటు కరోనా బాధితుల ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆయన తెలిపారు. ప్రమాద దృష్యా రాష్ట్రంలో బాణసంచా ఆమ్మకాలు మరియు కాల్చడంపై నిషేధాన్ని విధిస్తూ హైకోర్టు నిన్న సూచించిన విషయం తెలిసిందే. అందుకనుగణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు, వ్యాపారస్తులు దీపావళి రోజు బాణసంచా అమ్మకాలు జరపడం, వాటిని వినియోగించినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు.