హైదరాబాద్ మాదాపూర్ లో కలకలం రేగింది. ఇస్మాయిల్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఈ రోజు ఉదయం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయినవి. హైదరాబాద్ లో కాల్పులు కలకలంరేపాయి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గరలో పాతబస్తి కాలపత్తర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇస్మాయిల్ అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా కి తరలించారు.
ఇస్మాయిల్ కారులో వెళ్తుండగా బైక్ పై వచ్చి కాల్పులు జరిపారు. ఇస్మాయిల్‌పై కాల్పులు జరిపింది జిలానీ, మహ్మద్ పోలీసులు గుర్తించారు. పాతకక్షలతోనే ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇస్మాయిల్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. భూ వివాదం కారణంగానే కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లో కాల్పులు జరగ్గా డెడ్‌బాడీని తీసుకెళ్లి జూబ్లీహిల్స్ నీరూస్ దగ్గర వదిలివెళ్లారు. ఈ కాల్పుల వ్యవహారంలో ఓ వ్యక్తి ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఓ భూ వివాదంపై చర్చించేందుకు అక్కడికి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రియల్ ఎస్టేట్ వివాదాలే కారణం అంటున్న పోలీసులు.