end
=
Sunday, January 19, 2025
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీతొలి పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం
- Advertisment -

తొలి పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్మించిన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దేశంలోని తొలి పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో ఏడెకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్ణించారు. ఐదు టవర్లున్న ఈ కేంద్రంలో 6.42లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంది. భవనం మొత్తం ఎత్తు 83.5మీటర్లు. టవర్‌ ‘A’లో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఉంటుంది. సుమారు రూ.600 కోట్లతో నిర్మించారు. సీఎంతో పాటు హోంమంత్రి, ఇతర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, డీజీపీ, అదనపు డీజీపీలు, సీపీలు, జిల్లా ఎస్పీలు, పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు, భవన నిర్మాణం చేపట్టిన ఆర్‌అండ్‌ బీ అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.

2016 నవంబర్‌ 22న ప్రారంభమైన కమాండ్‌ కంట్రోల్‌ భవన నిర్మాణ పనులు పూర్తవడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. గతంలో రెండుసార్లు ప్రారంభోత్సవానికి రెండుసార్లు ముహూర్తం నిర్ణయించినప్పటికీ పనుల ఆలస్యం కారణంగా వాయిదా పడింది. చివరకు ఈ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -