end

Leukemia:ప్రపంచలోనే మొదటి సారి

  • లుకేమియా చికిత్స పొందిన 13 ఏళ్ల చిన్నారి


యూకేకు చెందిన 13 ఏళ్ల చిన్నారి ప్రపంచలోనే మొదటి సారి విజయవంతమైన లుకేమియా(Leukemia) చికిత్స పొంది వార్తల్లో నిలిచింది. అయితే ‘అలిస్సా’ అనే బాలికకు ఈ వ్యాధి ఉన్నట్లు 2021లో నిర్ధారణ కాగా.. కీమోథెరపీ, బోన్ మ్యారో(Bone Marrow) ట్రాన్స్‌ప్లాంట్‌తో సహా సంప్రదాయక నాటు వైద్యం లాంటి చికిత్సలు ఎన్నో తీసుకున్న పెద్దగా ఫలితం లేకపోయింది. అంతేకాదు తన నివసించే ప్రాంతంలో తనకు వచ్చిన వ్యాధిని నయం చేయలేమని(It cannot be cured) ఎంతోమంది వైద్యులు చెప్పినప్పటికీ పట్టుదలతో పోరాటం చేసిన ఆమె చివరికి క్యాన్సర్(Cancer) నుంచి ఉపశమనం పొందడం ప్రపంచం సంతోషించే విషయం.

ఇక T-సెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాతో ఆమె చేసిన పోరాటం గురించి వివరిస్తూ లండన్‌(London)లోని ‘గ్రేట్ ఓర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్’ (GOSH) ఒక ప్రకటనను విడుదల చేసింది. అలిస్సాకు వచ్చిన వ్యాధిని ‘అగ్రెస్సీవ్ బ్లడ్ క్యాన్సర్’గా పేర్కొన్న హాస్పిటల్ బృందం.. ‘అలిస్సా(Alyssa) మా క్లినికల్ ట్రయల్‌లో కేసు నమోదు చేసుకునే ముందు ఎన్నో ఇతర చికిత్సలను ముగించింది. అయితే ఈ సంవత్సరం మేలో మేము ఏర్పాటు చేసిన కొత్త క్లినికల్ ట్రయల్‌(Clinical Trial)లో పేరు నమోదు చేసుకున్న మొదటి రోగి ఆమె కావడం విశేషం. మా దగ్గర కేవలం 28 రోజుల తర్వాత క్యాన్సర్ నుంచి ఉపశమనం పొందింది. ఆరోగ్యకరమైన దాత నుండి జన్యుపరంగా మార్పు చెందిన రోగనిరోధక కణాలను మేలో స్వీకరించి క్లినికల్ ట్రయల్‌లో ఉంచాం. ఆమె రోగనిరోధక(Immunity) శక్తిని పునరుద్ధరించడంలో సహాయపడటానికి ఎముకల మధ్యనున్న మజ్జలను మార్పిడి చేశాం. ఈ ప్రయోగాత్మక చికిత్స లేకుంటే అలిస్సా కోలుకునేది కాదు. ఇది వైద్య రంగంలోనే విశేషమైనదిగా భావిస్తున్నాం. అయితే రాబోయే నెలల్లో ఫలితాలు ఇంకా పర్యవేక్షించాల్సివుంది’ అని స్పష్టం చేసింది.

(Kids Health:పేరెంట్స్ చేతుల్లోనే పిల్లల మానసిక ఆరోగ్యం)

చికిత్స ఏలా ఉంటుంది?
ఆసుపత్రిలోని వైద్య బృందాలు బేస్-ఎడిటింగ్ అని పిలువబడే జీనోమ్ ఎడిటింగ్ టెక్నిక్‌(Editing technique)ను ఉపయోగిస్తున్నాయి. ఇది రోగనిరోధక వ్యవస్థలో కీలకమైన తెల్ల రక్త కణాలు అయిన T- కణాలను(T-cells) మార్చడానికి DNA కోడ్‌ను రసాయనికంగా మార్చే పద్ధతి. ఇందులో సవరించిన T-కణాలు రోగికి ఇవ్వబడతాయి. అవి ఒకదానికొకటి కాపాడుకుంటూ శరీరంలోని క్యాన్సర్ T- కణాలపై దాడి చేసి నాశనం చేస్తాయి. ఈ అత్యంత అధునాతనతో కూడిన చర్య ఇతర కొత్త చికిత్సలకు మార్గం సుగమం చేస్తుంది. అనారోగ్యంతో ఉన్న పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందిస్తుందని జన్యు చికిత్స ప్రొఫెసర్ వసీమ్ ఖాసిమ్(Professor Waseem Qasim) అన్నారు.

అయితే ప్రస్తుతం మరో పది మంది రోగులకు గుర్తించి చికిత్స అందిచాలని చూస్తున్న వైద్యులు.. పిల్లలకు చిన్న వయసు(Young Age)లోనే ల్యుకేమియాతోపాటు ఇతర రకాల చికిత్స చేయడానికి మరొక ఎంపికగా దీన్ని చూడవచ్చని ఆశిస్తున్నారు. ఇక అర్హత(Eligibility) ఉన్న రోగులను మాత్రమే ట్రయల్ అంగీకరిస్తున్నట్లు ‘నేషనల్ హెల్త్ సర్వీస్ కేర్‌ (NHS)’కు ఆసుపత్రి తెలిపింది. చివరగా ప్రస్తుతం తన ఇంట్లోనే కోలుకుంటున్న అలిస్సా మాట్లాడుతూ.. ‘నేను దీన్ని ఒకసారి మొదటగా ప్రయత్నిస్తే నాలాంటి వాళ్లు ఎంతో మందికి ఒక మార్గం దొరుకుతుందని భావించా. కాబట్టి ఈ రోజు వియవంతమైన(Successful) చికిత్స ప్రజలకు ఎంతో సహాయం చేస్తుంది’ అని సంతోషం( Happily)గా చెప్పుకొచ్చింది.

Exit mobile version