- రోజూ వేలల్లో హాజరవుతున్న చేపలు
వియత్నాం(Vietnam)కు చెందిన ఓ వ్యక్తి వైల్డ్ చేపల(Wild FIsh)ను పెంచుతుండటంతో ఫేమస్ అయ్యాడు. యాన్ జియాంగ్ ప్రావిన్స్ లోని తన ఇంటికి రోజుకు 10వేల వరకు చేపలు వస్తుండటంతో పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. ఇంతకీ ఈ చేపలు ఎందుకు రోజూ అతని ఇంటిని విజిట్(Visit) చేస్తున్నాయి? ఎప్పటి నుంచి ఇది మొదలైంది? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
మెకాంగ్ డెల్టాలోని లాంగ్ కెయిన్ లో ఉండే తన ఇంట్లో ముయోయి ఫూక్ వంట చేస్తుండగా.. కిటికీలో నుంచి చూడగా దాదాపు 12 చేపలు ఫుడ్(Food) కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపించింది. దీంతో ఆయన చిరునవ్వు(Smile)తో ఫుడ్ నీటిలోకి విసిరాడు. దీంతో హ్యాపీగా తినేసిన చేపలు నెక్స్ట్ డే కూడా అదే టైమ్ కి రావడంతో మళ్ళీ బాతుల(Ducks)కు పెట్టే ఆహారాన్ని పెట్టాడు. 2020లో ఈ ఘటన జరగ్గా ఇప్పటికీ చేపలు ప్రతిరోజూ ఆయన ఇంటిని సందర్శిస్తుంటాయి. వేరే వాళ్ళు ఆహారం పెట్టేందుకు ప్రయత్నించినా లెక్క చేయకుండా ఆయన ఇంటి దగ్గరికి మాత్రమే వెళ్తుంటాయి. కాగా ఇప్పుడు ఈ చేపల సంఖ్య దాదాపు పదుల వేళల్లో ఉండగా.. దీనిని ఫిష్ స్కూల్(Fish School) గా పిలుస్తున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న కొందరు వలలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ వలలకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఫిషెస్.. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరికి తెలియని రహస్యం.
కాగా ఇన్ని చేపలకు ఫుడ్ పెట్టేందుకు రోజు కిలోల ఫుడ్ అవసరం అయ్యేది కానీ ఇప్పుడు టన్నుల(Ton) కొద్దీ అవసరం అవుతుంది. దీంతో ఆర్థికంగా భారం అవుతుందని చెప్తున్న ముయోయి.. ఫ్రూట్ అండ్ వెజిటేబుల్(Fruits & Vegetable) షాప్స్ వారు ఇచ్చే కుళ్లిన పదార్థాలను చేపలకు వేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. వాటికి కూడా ఈ ఆహారం ఇష్టమేనని తెలిపాడు. ఇక పర్యాటకుల సందర్శన ఎక్కువ కావడం ఆనందకరమైన విషయమే కానీ వలల నుంచి వాటిని రక్షించేందుకు వేడుకోలు తప్ప మరో మార్గం లేదన్నారు.