చేపల వల్ల మనకు చాలా ప్రయోజనలు ఉన్నాయి. మనకి ఎంతో ఆరోగ్యకరమైనవి.వీటి వలన కంటిచూపు(Eye Sight) పెరుగుతుంది.గర్బిణి(Pregnant ladies) స్రీలు ప్రసవం తర్వాత చేపలు ఎక్కువగా తింటే చంటి బిడ్డలకి సరిపడా పాలు ఉంటాయి అని మన పెద్దవాళ్ళు అంటూంటారు కదా. కనీసం 15 రోజులకొక్కోసారి అయిన చేపలు తినాలి. చేపలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్(Heart Attack) లు రాకుండా ఉంటాయి. శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. విటమిన్ డి ని, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను అధికంగా కలిగి ఉన్న ఆహారాల్లో చేపలు ఒకటి. అలాంటి చేపల్లో కొర్రమట్టలకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ చేపల్లో ముల్లులు తక్కువగా ఉంటాయి. ఈ కొర్రమట్టల పులుసు గురించి తెల్సుకుందాం.
కావల్సిన పదార్థాలు:
చేపలు కేజీ, నిమ్మరసం కొద్దిగా, ఉప్పు సరిపడా, కారం 2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా – 2 టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీస్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, జీలకర్ర – 1 స్పూన్, పెద్ద ఉల్లిపాయ, చింతపండు పులుసు, ధనియాల పొడి 1 టీస్పూన్, వేయించిన జీర పౌడర్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మెంతుల పొడి(Fenugreek powder) – కొద్దిగా.
(ఉల్లి మసాలా గుత్తి వంకాయ కూర తయారీ)
1.ముందుగా చేప ముక్కలని కొంచెం నిమ్మరసం(Lemon Juice),ఉప్పుతో కడిగి తరువాత పసుపు,ఉప్పు కొంచెం వేసి కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి.
2.చింతపండు(Tamarind)ని గంట ముందే గోరు వెచ్చటి నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. గోరు వెచ్చటి నీటిలో నానపెట్టడం వల్ల పులుసు సులభంగా వస్తుంది. ఉల్లిపాయలను తరిగి పెట్టుకోవాలి
3.ఇప్పుడు ఒక కడాయి లో నూనె వేసి వేడి అయిన తరువాత ఉల్లిపాయలను వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
4.తరువాత పచ్చిమిర్చి(చీలికలుగా కట్ చేసినవి),ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి 5 నిమిషాలు మగ్గించాలి.
5.ఇప్పుడు అందులో చింతపండు రసం,పులుసు కి తగినన్ని నీళ్లు కాసేపు(10 నిమిషాలు) ఉడికించాలి.
6.తరువాత పులుసులో చేప ముక్కలు వేసి ఒకసారి కలిపి మీడియం మంట మీద 20 నిమిషాలు ఉడికించుకోవాలి.
7.మధ్యమధ్యలో మూత తీసి చూస్తూ నీళ్లు అవసరం అనుకుంటే కొన్ని పోసుకుని కలిపి ఉడికించుకోవాలి
8.ఎక్కువగా చేపలను కలపకూడదు. అలా కలిపితే చేప ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది.జాగ్రత్తగా కలపాలి.
9.చేపలు ఉడికిన తర్వాత కొద్దిగా జీలకరపొడి(Cumin powder), కొద్దిగా మెంతుల పొడి(ఎక్కువ అయితే చేదు వస్తుంది) వేసుకోవాలి. వీటి వల్ల పులుసు కి ఇంకా చిక్కదనం వస్తుంది. 10. చివరగా కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేస్తే అదిరిపోయే కొర్రమట్టల పులుసు రెడీ.వేడి వేడి అన్నం తో తింటే చాలా రుచిగా ఉంటుంది.