ఐదంతస్తుల భవనం కుప్ప కూలి దాదాపు 70 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘోరకలి మహారాష్ర్టలోని రాయ్‌గడ్ జిల్లాలో సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో జరిగినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో సుమారు 15 మంది తీవ్రంగా గాయపడగా 70 మంది వరకు కూలిన శిథిలాల కిందనే ఉండిపోయారు.
ఈ భవనంలో 45 ఫ్లాట్లు ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలం ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండిః
- 5 ఏళ్ల పాప ఆకలిచావు !
- బంగారం స్మగ్లింగ్‌కు అడ్డాగా సీఎం ఆఫీసు?
- మహాత్మాగాంధీ కళ్లజోడు వేలం
- మూడు నిమిషాల్లో 7 లక్షల చోరీ
- తెలంగాణ టు ఆంధ్రా… అక్రమ మద్యం రవాణా