- ఆగ్రాలో తిండిలేక మరణించిన ఐదేళ్ల బాలిక
పేదరికం, దారిద్ర్యం దీంతో తినడానికి తిండిలేక ఓ ఐదేళ్ల బాలిక ఆకలిచావుకు గురైంది. ఈ దుర్బర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. ఈ దీన పరిస్థితి విషయమై ఆ తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్‌ను సంప్రదించగా యూపీ ప్రభుత్వానికి నోటీసులు అందాయి. ఈ దారుణమైన సంఘటనపై తగిన వివరణ ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ చీవాట్లు పెట్టింది.
పేదరిక నిర్మూలనకు వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయని, అలాంటిది యూపీలో బాలిక ఆకలి చావుకు గురికావడం చాలా విషాధకరమని మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా తప్పుబట్టింది. అయితే ప్రభుత్వం తరపున పాపకు తాము పాలు పంపించామని, ఆ బాలిక చావు ఆకలి వలన కాదని డయేరియా వచ్చింనందు వల్ల మరణించిందని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు.