స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాడెపల్లిగూడెంలోని ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగుర వేశారు.ప్రజలకు, పార్టీ కార్యక్తలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ అదుపులోనే ఉందని, మిగతా రాష్ర్టాలతో పోల్చితే ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా పకడ్బంది చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
సీఎం జగన్ ఎప్పటికప్పుడు కోవిడ్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటిక వరకు దాదాపు రూ.36 వేల రూపాయలను ప్రజల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ర్టాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసిందని, ప్రజలను మభ్యపెట్టి, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని కొనియాడారు.
ప్రజల సంక్షేమం, మహిళా సంక్షేమమే YSRCP ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. త్వరలోనే పేదలకు ఇళ్ళ పట్టాలు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇళ్ళు లేని వారు ఉండకూడదని సీఎం జగన్ భావిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.