end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంతెలంగాణ వ్యాప్తంగా జెండా వందనం
- Advertisment -

తెలంగాణ వ్యాప్తంగా జెండా వందనం

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌‌లోని హెచ్‌ఐసీసీ పరిదిలో సోమవారం (ఆగస్టు 8) సీఎం కేసీఆర్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించారు. అనంతరం జాతిపిత గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా అద్భుతంగా జరగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి జెండా వందనం కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎక్కడి వారు అక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని పిలుపునిచ్చారు. ఈ దేశం నాది అనే బావనా ప్రతి ఒక్కరిలో రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మనం స్వేచ్ఛా గా వాయువులు పీల్చుకునేందుకు ఎందరో ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. అనేక పోరాటాలు, త్యాగాల ఫలితమే భారత్‌కు స్వాతంత్య్రం అని పేర్కొన్నారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైందని పోరాటం మానేసి ఉంటే దేశానికి స్వాతంత్య్రం సాధ్యమయ్యేది కాదని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఏవైనా నెరవేర్చుకోవచ్చు అని వివరించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -