end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంశ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం...గేట్లు ఎత్తివేత
- Advertisment -

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం…గేట్లు ఎత్తివేత

- Advertisment -
- Advertisment -

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్నా భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,23,937 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో మూడు గేట్లను పది అడుగల మేర ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. 1,54,992 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.4 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు. ఇప్పుడు 212.43 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తునట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇదేగాకుండా పాలేరు ప్రాజెక్టుకు కూడా భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. నల్లగొండ, వరంగల్‌ జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాలకు 25 వేల క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -