end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంవరదసాయమే ప్రధాన ఎజెండా..!
- Advertisment -

వరదసాయమే ప్రధాన ఎజెండా..!

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అందుబాటులో ఉన్న అన్ని ప్రణాళికలను అమలు చేసి విజయాన్ని దక్కించుకునేందుకు అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ నేతలు వ్యూహరచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇటీవల ప్రజలకు అందించిన వరద సాయాన్ని కొందరు నేతలు ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నారు. తమ ప్రభుత్వం ప్రజల్ని ఆపత్కాలంలో ఆదుకుందని గుర్తుచేస్తూ, సాయం అందని వారికి ఎన్నికల తర్వాత అందేలా చేస్తామని హామీ ఇస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు.

ఇప్పటి వరకూ సాయం పొందిన బాధితుల జాబితాను జీహెచ్‌ఎంసీ, రెవెన్యూశాఖ నుంచి టీఆర్‌ఎస్‌ అధిష్టానం సేకరించినట్లు సమాచారం. వారి ఆధార్‌ కార్డులు, ఇంటి నంబర్లను తెప్పించుకున్న నాయకులు.. తమకే ఓటు వేయాలని ఆ అభ్యర్థులను కోరుతున్నట్లు తెలుస్తోంది. తాము సాయం పొందలేదన్నవారికి ఆధారాలు చూపించి మరీ ఓటును అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు కూడా సానుకూలంగానే స్పందిస్తారని పార్టీ నేతల్లో ధీమా వ్యక్తమవుతోంది. ఇప్పటికే సాయం పొందినవారు, మున్ముందు పొందాల్సిన వారు కూడా తమకే ఓటు వేస్తారని వారు భావిస్తున్నారు. వరద సాయాన్నే ప్రచారంలో ప్రధానంశంగా ప్రస్తావించాలని అధిష్ఠానం నుంచి అభ్యర్థులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

కానీ, టీఆర్‌ఎస్‌ పెద్దలు మాత్రం వరదసాయం మా ఎన్నికల ప్రణాళికలోనే లేదంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలనే ప్రజలకు వివరిస్తామన్నారు. ఎప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో నగరాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని వారంటున్నారు. ప్రభుత్వ పథకాలే టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా, బీజేపీ పార్టీ కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో బలమైన పార్టీగా ప్రచారంలో దూసుకెళ్తోంది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తూ.. తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్‌ పొత్తు పెట్టుకొని, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -