end

టీ20, వన్డేలపైనే దృష్టి సారిస్తా..

  • ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌, విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ టెస్టులకు గుడ్‌ బై చెప్పనున్నాడా..! అంటే ఔననే సమాధానం వస్తుంది. ఈ విషయాన్ని పరోక్షంగా మ్యాక్సీనే ప్రకటించాడు. మీడియాతో మాట్లాడిన మ్యాక్సీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇక నుంచి పరిమిత ఓవర్ల(టీ20, వన్డేలు) క్రికెట్‌ పైనే నా దృష్టంతా. టెస్టుల నుంచి తప్పుకొని, టీ20 వరల్డ్‌ కప్‌లు, టోర్నీలు, 2023 వన్డే ప్రపంచకప్‌లలో రాణించడానికి కృషి చేస్తానంటున్నాడు మ్యాక్స్‌వెల్‌.

కాగా, టెస్టుల్లో మిడిలార్డర్‌లో తీవ్ర పోటీ నెలకొని ఉందన్నాడు. తాను ఇప్పటికే చాలా క్రికెట్‌ ఆడానన్న గ్లెన్‌.. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలనుకుంటున్నాడు. కామెరూన్‌ గ్రీన్‌, పకోస్కీ, ట్రావిస్‌ హెడ్‌ మిడిలార్డల్‌లో చక్కగా రాణిస్తున్నారని ఆయన వెల్లడించారు. వారికి టెస్టుల్లో 40 శాతానికి పైగా సగటు ఉందని, కాబట్టి వారికి మరిన్ని అవకాశాలు దక్కాలని మ్యాక్స్‌వెల్ కోరుకుంటున్నాడు.

Exit mobile version