- పిల్లలు కరోనా, సీజన్ వ్యాధుల బారి నుండి కాపాడుకోండి
Immunity Power:అసలే కరోనా కాలం, అందులోనూ వర్షాకాలం అంటు వ్యాధులు(Infectious diseases), సీజనల్ వ్యాధులు రావడానికి చాలా ఆస్కారం ఉన్న సీజన్. ఇంకా చిన్న పిల్లల పరిస్థితి ఏంటి? ఈ వానాకాలం సీజన్‌లో చిన్నపిల్లలకు తొందరగా జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటాయి. చిన్న పిల్లల ఆసుపత్రులన్నీ(Hospital) కిక్కిరిసిపోతాయి. సీజనల్ వ్యాధుల నుండి ముఖ్యంగా కరోనా(Corona) బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అందుకే రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలను పిల్లలకు తినిపించాలి. దీని వలన సాధ్యమైనంత వరకు పిల్లలను ఆసుపత్రిపాలు కాకుండా నివారించవచ్చు.
అక్రమ ఉల్లి ఎగుమతులకు కేంద్రం చెక్
నట్స్ : పిల్లలకు రోజు నానబెట్టిన 5 బాదం గింజలు ఇవ్వాలి. అలాగే జీడిపప్పు, పిస్తాపప్పు(Pistachios) తినిపించండి. వీటిలో అధికంగా ఉండే పోషకాలు, విటామిన్లు, ప్రోటీన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
శ్రీరాంసాగర్‌కు భారీగా వరదనీరు
దుంపలు : దుంప జాతులైన క్యారెట్, బీట్‌రూట్(Carrot & Beetroot)లను ముక్కలుగా కట్ చేసి పిల్లలు తినేలా చేయాలి. ఆడుకునే సమయంలో లేదా చదువుకునే సమయంలో ఒక గిన్నెలో క్యారెట్ ముక్కలు, బీట్‌రూట్ ముక్కలు వేసి ఇవ్వాలి. వీటిలో ఉండే విటమిన్ ఎ, జింక్ కంటిచూపు(Eye Site) మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి.
30 మంది రైల్వే ఉద్యోగులకు కరోనా
పాల ఉత్పత్తులు : పిల్లలకు పెరుగు అలవాటు చేయాలి. దీని వల్ల పొట్టలో ఉండే చెడు బ్యాక్టీరియా(Bacteria) నశింపజేసి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. అలాగే గోరు వెచ్చని పాలలో కొంచెం పసుపు వేసి తాగించాలి.
ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
నిమ్మజాతి పండ్లు : అన్ని నిమ్మజాతి పండ్లలో విటమిన్ సి(Vitamin C) పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి బత్తాయి, నారింజ పండ్లను పిల్లలకు తినిపించాలి. తొందరగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే దగ్గు, శ్వాసకోశ వ్యాధులు రాకుండా కాపాడుతాయి.
పది నిమిషాల్లో ఇంటికి చేరాల్సింది!