end
=
Monday, January 20, 2025
క్రీడలుఫుట్‌బాల్‌ దిగ్గజం మారడోనా మృతి
- Advertisment -

ఫుట్‌బాల్‌ దిగ్గజం మారడోనా మృతి

- Advertisment -
- Advertisment -

ఫుట్‌బాల్‌ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా(60) మరణించారు. గుండెపోటుతో ఆయన నిన్న సాయంత్రం చనిపోయారు. ఇటీవలే ఆయన మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. 1960 అక్టోబర్‌ 30న అర్జెంటీనాలో జన్మించిన మారడోనా1986లో తన దేశానికి ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ అందించాడు. ఫుట్‌బాల్‌ క్రీడలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిచారు. తన కేరీర్ మొత్తంలో 694 మ్యాచులు ఆడిన ఈ దిగ్గజం ఆటగాడు 354 గోల్స్‌ చేశాడు.

కాగా, మారడోనా మరణంతో క్రీడా ప్రపంచం ఒక్కసారిగా విస్తుపోయింది. ఇలాంటి దిగ్గజ ఆటగాడిని కోల్పోవడం చాలా బాధాకరమని క్రీడాకారులు, క్రీడా విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. మారడోనా అనంతరం.. అర్జెంటీనా ఫుట్‌బాల్‌కు పేరు తెచ్చింది లియోనల్‌ మెస్సీ.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -