end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంpriests:పూజారుల‌గా అన్ని కులాల వారికీ..
- Advertisment -

priests:పూజారుల‌గా అన్ని కులాల వారికీ..

- Advertisment -
- Advertisment -

త‌మిళ‌నాడు ప్రభుత్వ తాజా నిర్ణయం!


అన్ని కులాల వారు పూజారులు అయ్యే ప‌థ‌కాన్ని త‌మిళ‌నాడు(Tamil Nadu) ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ ప‌థ‌క ప్రారంభం సంద‌ర్భంగా త‌మిళ‌నాడు ముఖ్య మంత్రి స్టాలిన్(Stalin) 58 మందికి నియామ‌క ఉత్తర్వులని అందించారు. త‌మిళ‌నాడు ప్రభుత్వం కొత్త ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. హిందూ దేవాల‌యాల్లో బ్రాహ్మనేతర(Non-Brahmin) కులాల వారిని పూజారులుగా నియ‌మించింది. చెన్నైలో శ‌నివారం 58 మందికి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులని అందించింది. వారికి త‌మిళ‌నాడు హిందూ రిలీజియ‌స్ అండ్ చారిట‌బుల్ ఎండోమెంట్ ఆధ్వర్యం లో శిక్షణ అందించారు. 2006లోనే ఈ ప‌థ‌కాన్ని ప్రవేశ పెట్టినా న్యాయ ప‌ర‌మైన సమస్యలతో పూర్తిగా అమ‌లు కాలేదు. 2021 రాష్ట్ర శాస‌న స‌భ ఎన్నిక‌ల ప్రచారం డీఎంకే పార్టీ ఇత‌ర కులాల వారికి అర్చకత్వం ఇస్తామ‌ని హామీ ఇచ్చింది.

ఇచ్చిన హామీ(Guarantee)ని అమ‌లు చేస్తు రాష్ట్ర ముఖ్య మంత్రి స్టాలిన్ 58మందిని పూజారుల‌(Priests)గా నియ‌మించారు. ఇందులో 24 మందికి ప్రభుత్వం శిక్షణ ఇవ్వగా మరో 34 మంది ప్రైవేటుగా శిక్షణ పొందిన వారు ఉన్నారు. ప్రభుత్వం నియ‌మించిన 24 మందిలో 5 గురు షెడ్యూల్ కులాల(Guru Schedule Castes) వారు, 6 గురు ఎంబీసీలు, 12 మంది బీసీలు ఉండ‌గా ఒక‌రి ఓసీ ఉన్నారు. వీరితోపాటు మ‌రో 138 మందిని ఆల‌యాల్లో ప‌ని చేయ‌డానికి నియ‌మించారు. రాష్ట్రంలోని అన్ని దేవాల‌యాల్లో త‌మిళంలోనే పూజ చేసే ప‌థ‌కాన్ని ఇటీవ‌లే మొద‌లు పెట్టారు. ఇక మీద అర్చకులు అన్ని దేవాల‌యాల్లో త‌మిళంలోనే పూజ‌లు నిర్వహించున్నారు. మంచి మార్పు నిస్తుంద‌ని వారు అభిప్రాయ ప‌డుతున్నారు.

(God:దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం పెట్టుకోకూడదా?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -