end

Telangana:కంటి వెలుగు కోసం రూ. 200 కోట్లు

  • రెండో దఫా కంటి వెలుగుకు సర్వసన్నద్ధం కావాలి
  • జనవరి 18 ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
  • వైద్యారోగ్య శాఖ ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి హరీశ్రావు ఆదేశాలు
  • పరీక్షలు, ఏఆర్మిషన్లు, కంటి అద్దాలు సమకూర్చుకోవడం, సిబ్బందితదితర ఏర్పాట్లపై సమీక్ష
  • పిహెచ్సీ నుంచి జిల్లా స్థాయి సిబ్బందికి త్వరగా శిక్షణ పూర్తి చేయాలి
  • రాష్ట్ర వ్యాప్తంగా 1500 వైద్య బృందాల ద్వారా కోటిన్నర మందికి ఉచిత కంటి పరీక్షలు
  • పర్యవేక్షణ కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో  బృందాల ఏర్పాటు
  • స్టేట్ లెవెల్ 10 క్వాలిటీ కంట్రోల్ టీం, జిల్లాల్లోకొక క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటు
  • సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరేలా ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయాలి
  • అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించాలి.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నివారించదగిన అంధత్వ రహిత తెలంగాణ’ లక్ష్యంలో భాగంగా, వచ్చే ఏడాది జనవరి18న ప్రారంభించ తలపెట్టిన రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని విధాలా సన్నద్ధమై ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు(Harish Rao) ఆదేశించారు. ప్రజల కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఆగస్టు 15, 2018లో తొలి దఫా కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసినట్లు గుర్తు చేశారు.మొదటి విడుత కార్యక్రమం సత్ఫలితాన్ని ఇవ్వడంతో ఇప్పుడు మరోమారు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సీఎం కేసీఆర్‌(CM KCR) లక్ష్యానికి అనుగుణంగా పని చేసి, ప్రజల కంటి సమస్యలు తొలగించి, కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు చేసి, ఉచితంగా కళ్లద్దాల(Eye Glasses) పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు.

(Organ donation:అవయవ దాతలకు డబుల్ బెడ్​రూమ్!)

కంటి వెలుగు కార్యక్రమం కోసం 200 కోట్లు ప్రభుత్వం ఇస్తున్నదన్నారు. మంగళవారం కంటివెలుగుకు సంబంధించి ప్రొక్యూర్‌మెంట్‌, అవసరమైన సిబ్బంది, శిక్షణ, సాంకేతిక, ప్రచార కార్యక్రమాలు, ఇతర ఏర్పాట్లపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రి సమీక్ష నిర్వహించారు. మొదటి దఫా పథకంలో భాగంగా 1.5 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి, 50లక్షల అద్దాలు పంపిణీ  చేయగా, రెండో దఫా కంటి వెలుగులో భాగంగా ఈ సారి 1.5 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి, 55 లక్షల అద్దాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా 30లక్షలు రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్(Prescription glasses) అవసరం ఉంటుందని అంచనా వేసింది. 5 నెలల పాటు, 1500 ప్రత్యేక  బృందాలు ఏర్పాటు చేసి క్యాంప్‌ మోడ్‌లో ఈ కార్యక్రమంనిర్వహించనున్నారు. దీంతో పాటు,  850 ఏఆర్‌ మిషన్లు, 1500 ట్రయల్‌ లెన్స్‌ బాక్స్‌, 1500 టార్చెస్‌, 1800 స్నెలెన్‌ చార్ట్‌, సమకూర్చడం పై వైద్యారోగ్య ప్రధానంగా దృష్టి సారించింది. వీటి ప్రొక్యూర్‌మెంట్‌(Procurement) ప్రక్రియ వేగవంతం చేయాలనిమంత్రి హరీశ్‌ రావు ఈ సందర్భంగా ఆదేశించారు.

1500 అప్టో మెట్రిషన్స్, 1500 డేటా ఎంట్రీ ఆపరేటర్లు(Data Entry Operators) నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.969 పి హెచ్ సి డాక్టర్ల ఫైనల్ లిస్ట్ వచ్చే నెల ఒకటో తారీకు విడుదల చేస్తున్నమనీ, పల్లె దవాఖాన 589, 811  బిఎఎంఎస్ వారు ఇప్పటికే రిక్రూట్ అయ్యారన్నారు. కార్యక్రమం కొనసాగించేందుకు అవసరమైన వైద్యులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎక్కడా వైద్యుల కొరత ఉండదు అన్నారు.అన్ని సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, జిల్లా స్థాయి వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు.100 పని దినాల్లో లక్ష్యం పూర్తి చేసేలా పని చేయాలని, ఇందుకు గానుమొదటి దఫాలో 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు ఆ సంఖ్య ను 1500 లకు పెంచుతున్నట్లు తెలిపారు.

నాణ్యత(Quality) విషయంలో రాజీపడకుండా,నాణ్యమైన కంటి అద్ధాలను అవసరంఉన్న వారికి ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.స్టేట్ లెవెల్ 10 క్వాలిటీ కంట్రోల్ టీం, జిల్లాల్లోకొక క్వాలిటీ కంట్రోల్ టీమ్(Quality Control Team) ఏర్పాటు చేస్తమని, ఇవి ప్రభావవంతంగా కార్యక్రమం జరుగుతుందా లేదా అని పరిశీలన చేస్తాయన్నారు.కంటి చూపును నిర్లక్ష్యం చేస్తూ దృష్టిలోపంతో బాధపుడుతున్న వారికి కంటివెలుగును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని అన్నారు. కంటివెలుగు(Kanti Velugu) కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కంటి పరీక్షలు, కంటి అద్దాలు, మందులు తదితరాలు ప్రభుత్వ ఖర్చుతో పూర్తి ఉచితంగా అందజేయనున్నట్టు తెలిపారు.కంటిని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంటి ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనను కూడా కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ సందర్భంగా కల్పించనున్నారని తెలిపారు.

తెలంగాణ(Telangana)లో కంటి చూపు సమస్యలతో ఏ ఒక్కరూ బాధపడకుండా చూడాలనే సదుద్దేశంతో ప్రారంభిస్తున్న కంటివెలుగు పథకాన్ని విజయవంతం చేయాలని, అందుకు గానుఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్ పి ఛైర్మెన్స్సహా ఎంపిటిసిలు, సర్పంచులు, ఇతరఅందరూ  ప్రజాప్రతినిధులను వివిధ స్థాయిల్లోని సామాజిక కార్యకర్తలను బాధ్యతగల పౌరులను కలుపుకు పోవాలని, ఆయా ప్రాంతాల్లో జరిగే కంటి వెలుగు శిబిరాల(Camps) వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ సహకారం తీసుకోవాలని సమీక్షా సమావేశంలో మంత్రి అధికారులను ఆదేశించారు.సమీక్ష కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీటి ఎస్ ఎం ఎస్ ఐ డి సి చైర్మన్ఎర్రోళ్ల శ్రీనివాస్, కుటుంబ, సంక్షేమ విభాగం కమిషనర్‌ శ్వేత మహంతి, సీఎం ఓ ఎస్ డి గంగాధర్,టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి ఎండి చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ జి శ్రీనివాస్‌, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, కంటి వెలుగు నోడల్ ఆఫీసర్లు స్వరాజ్య లక్ష్మి, కౌటిల్య తదితరులు పాల్గొన్నారు. 

(Covid:తొలి ఇంట్రానాజిల్ కొవిడ్ వ్యాక్సిన్‍కు ఆమోదం)

Exit mobile version