మళ్లీ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టబోతున్న కిరణ్ కుమార్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy)చాలా కాలం తర్వాత కనిపించారు. అది కూడా తన స్నేహితుడు సురేష్ కుమార్ రెడ్డి, బాలకృష్ణతో (Suresh Kumar Reddy and Balakrishna)కలిసి మెరిశారు. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో (Unstoppable talk show)లో కిరణ్ కుమార్ రెడ్డి సెన్సేషన్ కామెంట్స్ (Sensation comments)చేశారు. ఇవే ఇప్పుడు పొలిటికల్‌గా చర్చకు దారితీస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అజ్ఞాతం వీడారా.. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారా.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతోంది.. సడెన్‌గా తన స్నేహితుడితో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై (On the TT platform)మెరిసిన ఈ కిరణం ఎక్కడ ప్రకాశించబోతోంది..
వైఎస్‌ను తన విషయంలో తప్పుదోవ పట్టించారన్న నల్లారి
బతికి ఉండడం వల్లే తాను సీఎం అయ్యానంటూ నల్లారి షాకిచ్చారు. అక్కడితోనే ఆగలేదు.. సీనియర్ మంత్రి ఒకరు తన విషయంలో వైఎస్ఆర్ (YSR) ను తప్పుదోవ పట్టించారని నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. సాధారణంగానే వైఎస్ఆర్ కు కిరణ్ కుమార్ రెడ్డి చాలా సన్నిహితంగా ఉండేవారు.. కిరణ్ ను వైఎస్ఆర్ చాలా నమ్మకంగానే చూసేవారు. మరి అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో అప్పటి సీఎం వైఎస్ఆర్ ను తప్పు దోవ పట్టించిన మంత్రి ఎవరు అంటూ అంతా ఆరా తీస్తున్నారు.
కిరణ్ సిఎం అయినప్పుడు అనేక పరిణామాలు
కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినప్పుడు చాలా ఉత్కంఠభరిత పరిణామాలు జరిగాయి. ఆయన సీఎం అవుతారని ఎవరూ ఊహించలేదు కానీ అనూహ్యంగా ఆయన పేరు అప్పట్లో తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. దానిపైనా తాజా ఎపిసోడ్ (episode) లో కిరణ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రోమో (Promo)లో ఆ విషయాన్ని బాలయ్య హైలైట్ (Highlight)చేశారు. షోలో బాలకృష్ణ మాట్లాడుతూ, ఇటీవల బాలయ్య కుటుంబాన్ని చూశారు, ఇప్పుడు బాలయ్య స్నేహాన్ని చూస్తారు అంటూ ప్రకటించారు. అన్నట్టుగానే తన కాలేజీ స్నేహితులైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిలను ఆహ్వానించి.. కాలేజ్ డేస్ నుంచి కిరణ్ కుమార్ సీఎం అయిన వరకు జరిగిన ముచ్చట్లను ప్రజలముందు ఉంచారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
(Casino Case:తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోన్న చీకోటి లింకులు)
రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజకీయ పార్టీ
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన అనేక రాజకీయ పరిణామాలతో కొత్త రాజకీయ పార్టీ (new political party)కూడా పెట్టారు.. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఆ మధ్య చిత్తూరులోని తన సొంతూరులో పర్యటించిన కిరణ్ కుమార్ రెడ్డి.. త్వరలోనే మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ (Politically active again) అవుతానని.. అందరి సమస్యలు తీరుస్తానని వారికి హామీ ఇచ్చారు.
ఇప్పుడు మళ్లా సత్తా చాటుతానంటున్న నల్లారి రాష్ట్ర విభజన తర్వాత చాలా కాలానికి మళ్లీ కాంగ్రెస్ (Congress)గూటికి చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. ఆయన పార్టీలో ఎప్పుడూ క్రియాశీలక పాత్ర పోషించలేదు. ఏపీ పీసీసీ చీఫ్ (AP PCC chief) పదవిని ఆయన ఆశించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సమయంలో సోనియా గాంధీని (Sonia Gandhi ) కిరణ్‌కుమార్ రెడ్డి కలిశారు. సోనియాతో జరిపిన చర్చలు ఏమయ్యాయో కానీ.. ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఏపీలో సత్తా చాటాలని చూస్తున్నారట. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావాలనుకుంటున్నారట.. దీనికి తోడు బాలయ్య చేసిన ఇంటర్వ్యూలో (interview)ఆయన చెప్పిన చాలా విషయాలు ఇంకెంత ఆసక్తిని కలిస్తాయో.. ఎన్ని సంచలనాలకు దారి తీస్తాయోనని తెలుగు రాష్ట్రాల ప్రజలు వెయిటింగ్.
(Beer:‘బీర్’తో అల్జీమర్స్ వ్యాధి మాయం)