end
=
Sunday, July 7, 2024
వార్తలుజాతీయంమాజీ ఎమ్మెల్యే కన్నుమూత..
- Advertisment -

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..

- Advertisment -
- Advertisment -

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టీ. రాజా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. రాజా మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు శోకసంద్రంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు, జిల్లాకు చెందిన నేతలు హైదరాబాద్‌కు పయనమయ్యారు. రాజా మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌తో పాటు పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వై.టీ. రాజా తెలుగుదేశం పార్టీ తరఫున 1999లో తణుకు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009లో టీడీపీ తరఫునే పోటీచేసి పరాజయం పాలయ్యారు. 2014లో ఆరిమిల్లి రాధాకృష్ణను టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాధాకృష్ణ గెలుపుకోసం రాజా కృషిచేశారు.

పార్టీ కీలక నేతను కోల్పోయింది: చంద్రబాబు
మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత రాజా మరణం పార్టీకి తీరని లోటని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మచ్చలేని నేతగా ఎదిగిన ఆయనకు ఇంత త్వరగా మరణం సంభవిస్తుందని అనుకోలేదన్నాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు బాబు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -