end
=
Saturday, January 18, 2025
బిజినెస్‌ATM Card:ATM కార్డు ఉంటే రూ.2 లక్షల ఉచిత బీమా
- Advertisment -

ATM Card:ATM కార్డు ఉంటే రూ.2 లక్షల ఉచిత బీమా

- Advertisment -
- Advertisment -

  • సాధారణ మాస్టర్ కార్డ్‌పై రూ.50 వేలు
  • ప్లాటినమ్ మాస్టర్, వీసా కార్డ్‌లపై రూ.5 లక్షలు


ప్రస్తుతం ఏటీఎమ్‌ కార్డు (ATM Card) లేని వారు ఎవరూ ఉండనరడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బ్యాంకింగ్‌ (Banking) వ్యవస్థ విస్తృతి పెరగడం, ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల మొత్తాన్ని నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తుండడంతో ప్రతీ ఒక్కరూ బ్యాంక్‌ ఖాతా (Bank account) తీస్తున్నారు. దీనికి తోడు ఏటీఎమ్‌ కార్డుల వినియోగం కూడా భారీగా పెరిగింది. అయితే డెబిట్‌ (Debit card)కార్డ్‌లు కేవలం డబ్బులు తీసుకోవడానికి, షాపింగ్‌ చేయడానికి మాత్రమే కాదు దాంతో పాటు ఉచిత బీమా పొందే అవకాశం కూడా ఉందని మీకు తెలుసా.? చాలా మందికి వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోలేరు. ఇంతకీ డెబిట్ కార్డు ఉన్న వారికి ఎంత బీమా ఉంటుంది.? దీనిని ఎలా క్లైమ్‌ (Clime) చేసుకోవాలి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బ్యాంక్‌ జారిచేసిన డెబిట్‌ కార్డ్‌ ఉన్న కస్టమర్లు ఉచితంగా ప్రమాద బీమను పొందుతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ (State Bank of India website) ప్రకారం.. కార్డు ఉన్న వారికి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ బీమా (Personal Accident Insurance, Personal Air Accident Insurance Insurance) అందిస్తారు. ఈ బీమా కార్డుల రకాలను బట్టి మారుతుంది. ఎస్‌బీఐ గోల్డ్‌ మాస్టర్‌ లేదా వీసా కార్డ్‌ (SBI Gold Master or Visa Card) ఉంటే అతనికి రూ. 2 లక్షల భీమా లభిస్తుంది. బ్యాంక్ ప్రకారం, ప్రమాదం జరిగిన తేదీ నుంచి గత 90 రోజులలో (Days) ఒకసారి కార్డును ఉపయోగించినప్పుడు ఈ బీమా వర్తిస్తుంది.

ఎవరు అర్హులంటే..
ఒక వ్యక్తి కనీసం 45 రోజుల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఏటీఎమ్‌ను ఉపయోగిస్తే (ATM Government or Private bank) బీమా పొందడానికి అర్హుడు. ఈ సమయం బ్యాంకుల ఆధారంగా మారుతుంది. క్లాసిక్ కార్డ్‌ (Classic card) పై రూ.లక్ష, ప్లాటినం కార్డుపై రూ.2 లక్షలు, సాధారణ మాస్టర్ కార్డ్‌పై రూ.50 వేలు, ప్లాటినమ్ మాస్టర్ కార్డ్, వీసా కార్డ్‌లపై రూ.5 లక్షలు పొందవచ్చు. వీసా కార్డుపై 1.5 నుంచి 2 లక్షల రూపాయల వరకు బీమా కవరేజీ అందుతుంది. ప్రధాన్ మంత్రి జన్-ధన్ యోజన (Pradhan Mantri Jan-Dhan Yojana) కింద, వినియోగదారులు రూప్ కార్డ్ ఇన్సూరెన్స్‌ (Roop Card Insurance)పై రూ. ఒకటి నుంచి రెండు లక్షల వరకు బీమా కవరేజీని కూడా పొందుతారు.

(PM MODI:ఉగ్రవాదమే కాంగ్రెస్ ఓటు బ్యాంక్)

ఎలా క్లైమ్‌ చేసుకోవాలంటే..
డెబిట్ కార్డ్ హోల్డర్ (Debit Card Holder) ప్రమాదంలో మరణిస్తే, అతని నామినీ సంబంధిత బ్యాంకుకు వెళ్లి బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. నామినీ మరణ ధృవీకరణ పత్రం, ఎఫ్‌ఐఆర్ కాపీ, డిపెండెంట్ సర్టిఫికేట్, మరణించినవారి సర్టిఫికేట్ ఒరిజినల్ కాపీ (Certificate, Copy of FIR, Dependent Certificate, Original Copy of Deceased Certificate) మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -