end

Puri Jagannadh :స్నేహమే శాశ్వతం అంటున్న పూరీ

Puri Jagannadh : పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్‌(Charmy Kour) తెలుగులో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది. ఛార్మి తన నటనా ప్రావీణ్యాన్ని చూపించడమే కాకుండా నిర్మాతగానూ తన సత్తాను చాటుకుంది. పూరి జగన్నాథ్‌తో(Puri Jagannadh) కలిసి పూరి కనెక్ట్స్‌ పేరుతో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా ‘లైగర్‌’ (Liger) సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో పూరి-ఛార్మిల మధ్య ఏదో ఉందని టాక్ వినిపిస్తూనే ఉంది. ఈ కారణంగానే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని పుకారులు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఛార్మితో తనకున్న రిలేషన్‌ షిప్‌ను బయటపెట్టారు పూరి జగన్నాథ్‌.

(karthikeya2 : కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న కార్తికేయ 2)

ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఛార్మీ 13 ఏళ్ల వయస్సు నుండి నాకు తెలుసు, దశాబ్దాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. ఛార్మీకి నాకు ఏదో అఫైర్‌(affair) ఉందని ఇంకా ఏదేదో మాట్లాడుకుంటారు. ఆమె ఇంకా యంగ్‌గా ఉండి పెళ్లి చేసుకోకుండా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్‌ వస్తున్నాయి. అదే ఛార్మికి 50ఏళ్లు ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు. ఆమెకు వేరేవాళ్లతో పెళ్లి జరిగినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ తామిద్దరం సినీ ఇండస్ట్రీలో ఉండటం, ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్‌ అవుతుండటంతో ఇలా ఇష్టం వచ్చినట్లు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు(Rumors). ఒకేవళ అఫైర్‌ ఉన్నా అది ఎక్కువరోజులు నిలబడదు. ఆకర్షణ అనేది కొన్నిరోజుల్లోనే చచ్చిపోతుంది. స్నేహమే(Friendship) శాశ్వతంగా ఉంటుంది. మేమిద్దరం మంచి స్నేహితులమే అంటూ పుకార్లకు పూరి చెక్ పెట్టారు.

Exit mobile version