end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంహైద‌రాబాద్‌లోఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షం
- Advertisment -

హైద‌రాబాద్‌లోఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షం

- Advertisment -
- Advertisment -

హైద‌రాబాద్‌లో తెల్ల‌వారుజామున 4 గంట‌ల ప్రాంతంలో భారీ ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం ప‌డింది. విప‌రీత‌మైన గాలులు, ఉరుముల ధ్వ‌నుల‌తో ఒక్క‌సారిగా ప్ర‌జ‌లు ఉలిక్కిప‌డ్డారు. విద్యుత్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. రెండు నెల‌లుగా ఎండ వేడిమికి ఉక్క‌పోత‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌జ‌ల‌కు ఈ వ‌ర్షంతో ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ట్ల‌యింది. ఓ ప‌క్క కేంద్ర వాతావ‌ర‌ణ శాఖ తెలంగాణ‌తోపాటు ఇత‌ర రాష్ట్రాల‌కు ఎండ తీవ్ర‌త‌ను సూచిస్తూ ఆరేంజ్ సిగ్న‌ల్‌ను సూచిస్తూ హెచ్చ‌రిక చేసింది. ఈ సారి తెలంగాణ‌లో విప‌రీత‌మైన ఎండ‌లు, వ‌డ‌గాల‌లు వీచాయి. దాదాపు 46 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు చేరుకున్నాయి. రాత్రుల‌లో కూడా వాతావ‌ర‌ణం చాలా వేడిగా ఉంది. చిన్న పిల్ల‌లు, వృద్ధులు నిద్ర‌లేక చాలా ఇబ్బందులు ప‌డ్డారు. ఇక రాత్రికే రాత్రే వాతావ‌ర‌ణంలో మార్ప‌లు సంభ‌వించి ఒక్క‌సారిగా ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం ప‌డింది. సికింద‌రాబాద్‌, ముషీరాబాద్‌, బేగంపేట‌, ఉప్ప‌ల్‌, మ‌ల్కాజ్‌గిరి, అల్వాల్‌, పంజాగుట్ట‌, తార్నాక త‌దిత‌ర ప్రాంతాల‌లో భ‌యంక‌ర‌మైన మెరుపులు, ఉరుమ‌లు సంభ‌వించాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -