end

భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు

CM KCR
CM KCR
  • తెలంగాణ సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటారని ఆయన వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న న్యాయ‌మైన పోరాటాన్ని కేసీఆర్స ‌మ‌ర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు.

కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version