end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంLast Nizam Nawab:వివాదంలో నిజాం వారసుడి అంత్యక్రియలు
- Advertisment -

Last Nizam Nawab:వివాదంలో నిజాం వారసుడి అంత్యక్రియలు

- Advertisment -
- Advertisment -

  • ఇస్తాంబుల్‌లో మరణించిన ముకర్రంజా
  • అసఫ్‌జాఫీ సమాధుల ప్రాంగణంలోనే సమాధి

ఇటీవల టర్కీలో (Turkey)ని ఇస్తాంబుల్‌(Istanbul) లో మరణించిన నిజాం వారసుడు ముకర్రంజా (Mukarranja) అంత్యక్రియలు హైదరాబాద్‌లోని అసఫ్‌జాఫీ సమాధుల ప్రాంగణం (Asafzafi Tombs in Hyderabad)లో బుధవారం జరుగునున్నాయి. చివరి నిజాం నవాబు (Last Nizam Nawab)గా పట్టాభిషిక్తుడైన ముకర్రంజాకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు (funeral) నిర్వహించాలని ఆదేశించడంపై అభ్యంతరాలు వ్యక్తమైనా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌ సంస్థానానికి చివరి నిజాం వారసుడు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహద్దూర్‌ (Mir Usman Ali Khan Bahadur)మనుమడు ముకర్రంజాకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడంపై విహెచ్‌పి (VHP)అభ్యంతరం చెబుతోంది. మరోవైపు హైదరాబాద్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ (PAKISTAN)లో విలీనం చేసేందుకు ప్రయత్నం చేసిన నిజాం దేశద్రోహ చర్య మరిచారా అని ప్రశ్నిస్తున్న విశ్వహిందూ పరిషత్.. నిజాం వారసునికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

ఇస్తాంబుల్‌లో తుదిశ్వాస విడిచిన ముకర్రంజా అంత్యక్రియలు భాగ్య నగరంలో జరుగనున్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్‌లో కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముకర్రంజా గత శనివారం (SATURDAY) తుదిశ్వాస విడిచారు. ఇస్తాంబుల్‌ నుంచి ప్రత్యేక విమానంలో (Airoplain)ముకర్రంజా భౌతికకాయం మంగళవారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్‌కు రానుంది. అకడి నుంచి చౌమొహల్లా ప్యాలెస్‌ (Chaumohalla Palace)కు తరలించనున్నారు.

అయితే ఆఖరి నిజాం మనుమడు ముకర్రమ్ రుూ అంత్యక్రియలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలనే నిర్ణయం సరికాదని, అలా చేస్తే తెలంగాణా పోరాటాల చరిత్రను, నిజాం వ్యతిరేక పోరాటంలో నాటి ప్రజలు చేసిన త్యాగాలను అవమానించడమేనని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిజాం వారసత్వాన్ని అధికారికంగా గుర్తించడం తెలంగాణా ప్రజలను అవమానించడమేనని మండిపడుతోంది. ఈ మేరకు తెలంగాణ విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు (Telangana Vishwa Hindu Parishad State President Secretaries) ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ సంస్థానంలోని హిందువుల మాన ప్రాణాలపై నిజాం రజాకార్లు సాగించిన మారణహోమాన్ని ఎన్ని తరాలు మారినా ఇక్కడి ప్రజలు మర్చిపోరని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మహిళలను బట్టలు విప్పి బతుకమ్మ ఆడించిన చరిత్ర నిజాం రాజుది అని విమర్శించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.

ముకర్రంజా భౌతికకాయానికి నివాళులర్పించడానికి మంగళవారం (TUESDAY) రాత్రి 7.45 నుంచి 9 గంటల మధ్య నిజాం కుటుంబసభ్యులు, నిజాం కుటుంబానికి చెందిన వివిధ ట్రస్టీల ప్రతినిధులను అనుమతించనున్నారు. బుధవారం (WEDNESS DAY)ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సాధారణ ప్రజలు నివాళులర్పించేందుకు అనుమతిస్తారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు చౌమొహల్లా ప్యాలెస్‌ నుంచి మక్కా మసీదు వరకు అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. అసఫ్‌ జాహీ సమాధులు ఉన్న ప్రాంతంలో ముకర్రంజా తండ్రి మీర్‌ హిమాయత్‌ అలీఖాన్‌ ఆజంజా బహదూర్‌ సమాధి పక్కనే ముకర్రంజా అంత్యక్రియలను బుధవారం సాయంత్రం ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.

1933లో ఫ్రాన్స్‌లో (FRANCE) ప్రిన్స్ ఆజమ్‌జా, యువరాణి దుర్రు షెహావర్‌ (Prince Azamza and Princess Durru Shehawar)దంపతులకు ముకర్రంజా జన్మించారు. ఈయన పూర్తిపేరు మీర్‌ బార్కత్‌ అలీఖాన్‌ ముకర్రంజా (Mir Barkat Ali Khan Mukarranza). 1948లో భారత సంస్థానంలో విలీనమయ్యే వరకు నిజాం రాజవంశం తెలంగాణ ప్రాంతాన్ని పాలించింది. 1967 ఫిబ్రవరిలో 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ మరణం తర్వాత ముకర్రంజాకు 1967 ఏప్రిల్‌ 6న 8వ అసఫ్‌జాగా 8వ నిజాంగా పట్టాభిషేకం చేశారు. అప్పటికే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడంతో ఆయన పదవి నామమాత్రం అయ్యింది. 1971లో ఇందిరాగాంధీ రాజభరణాలు రద్దు చేసే వరకు 8వ నిజాం నవాబుగా ముకర్రంజాకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉండేది. 1977 ఎమర్జెన్సీ సమయంలో ముకర్రంజా ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత టర్కీకి పయనమై జీవితాంతం అకడే ఉన్నారు. ముకర్రంజా చివరి కోరిక మేరకు స్వదేశంలోనే ఖననం చేయాలనే సూచన మేరకు ఆయన భౌతికకాయాన్ని కుటుంబీకులు హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు.

హైదరాబాద్‌ సంస్థానం ఆఖరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహద్దూర్‌ మనుమడు ముకర్రంజా మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిజాం వారసుడిగా, పేదల కోసం విద్య, వైద్యరంగాల్లో ముకర్రంజా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌‌ను ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌ అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ముకర్రంజా అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో సోమవారం ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు, హైదరాబాద్‌ అడిషనల్‌ కమిషనర్‌ లా అండ్‌ ఆర్డర్‌ విక్రమ్‌సింగ్‌ మాన్‌, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ సలీం, ఇతర అధికారులు చౌమొహల్లా ప్యాలెస్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. బుధవారం వేల మంది చౌమొహల్లా ప్యాలెస్‌తోపాటు అసఫ్‌జాహీ సమాధుల ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ మళ్ళించనున్నారు.


(Gold rates:బంగారం ప్రియులకు భారీ షాక్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -