end

Gas stoves:గ్యాస్ స్టవ్ ఆరోగ్యానికి హానికరమే..

  • కాలుష్య కారకాలతో ముడిపడిన స్టవ్ వినియోగం
  • ఇంధన దహనంలో ఉపఉత్పత్తిగా నైట్రోజన్ డై ఆక్సైడ్
  • ఆందోళనకరంగా ఇండోర్ వాయు ఉద్గారాలు
  • ఆస్తమా, అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ తీవత్రరం కావచ్చు
  • కిచెన్‌లో రేంజ్ హుడ్ ఏర్పాటు, వెంటిలేషన్‌ ముఖ్యం
  • ఇండక్షన్ కుక్ టాప్స్ వాడకంతో తీవ్రత తగ్గే చాన్స్

ప్రస్తుతం మాగ్నెటిక్ ఇండక్షన్ కుక్‌టాప్స్ (Magnetic induction cooktops)పట్ల ఆసక్తి పెరుగుతోంది. సాధారణ స్టవ్స్ (Stoves) కంటే చాలా వేగంగా ఉడికించే (Fast boiling) ఉపరితలాలు, మంట మండించకుండా లేదా ఎలక్ట్రిక్ కాయిల్‌ (Electric coil)ను వేడి చేయకుండా వాటికుండే ప్రత్యేకతలే ఇందుకు కారణం. ఇలా ప్రామాణిక స్టవ్స్ కంటే ఎక్కువ శక్తితో సమర్థవంతమైనదిగా గుర్తింపు పొందిన ఇండక్షన్ స్టవ్ ( induction stove).. చాలా కాలంగా యూరప్, ఆసియా (Europe, Asia)లో ప్రసిద్ధి చెందింది. అయితే ఇటీవలి అధ్యయనాలు గ్యాస్ స్టవ్స్ నుంచి వెలువడే ఇండోర్ (indore)వాయు ఉద్గారాల గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. గ్యాస్ స్టవ్స్ ఆపరేట్ (operate) చేస్తున్నప్పుడు కూడా ప్రమాదకర వాయు కాలుష్యాలను విడుదల చేయగలవని కాలిఫోర్నియా ఎయిర్ రిసోర్సెస్ బోర్డ్ (California Air Resources Board)వంటి ఏజెన్సీలు నివేదించాయి. కాగా వివిధ రకాల ఇళ్లలో పొల్యూషన్‌కు గ్యాస్ స్టవ్స్ (Gas stoves for pollution)ఎలా దోహదపడతాయి? ఈ పరిస్థితుల్లో గ్యాస్‌కు దూరంగా ఉండటమే మంచిదా? తెలుసుకుందాం..

సాధారణంగా గ్యాస్ స్టవ్స్ ఉపయోగంతో ముడిపడిన ప్రధాన వాయు కాలుష్య కారకాల్లో ‘నైట్రోజన్ డై ఆక్సైడ్(NO₂)’ ఒకటి. ఇది ఇంధన దహనంలో ఉప ఉత్పత్తి. ఇళ్లలో నైట్రోజన్ డై ఆక్సైడ్ ఎక్స్‌పోజర్స్ (Exposures).. మరింత తీవ్రమైన ఆస్తమాతో పాటు పిల్లల్లో రెస్క్యూ ఇన్‌హేలర్స్ (Rescue inhalers) వినియోగం పెరగడంతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ వాయువు ఆస్తమా ఉన్న పెద్దలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలిక అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (Obstructive pulmonary disease)అభివృద్ధికి, తీవ్రతరమయ్యేందుకు రెండిటికీ దోహదపడుతుంది. ఇళ్లలోని నైట్రోజన్ డై ఆక్సైడ్ బయటి గాలి, ఇండోర్ సోర్సెస్ నుంచి లోపలికి వస్తుంది. ఇక్కడ రోడ్ ట్రాఫిక్ (road traffic)అత్యంత ముఖ్యమైన బహిరంగ మూలం. ఆశ్చర్యకరంగా ప్రధాన రహదారులకు దగ్గరగా ఈ లెవెల్స్ (levens)ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువసేపు పనిచేసే పెద్ద బర్నర్స్ (burner)నుంచి ఎక్కువ NO₂  ఉత్పత్తవుతుంది.

ఇంటి నిర్మాణాన్ని బట్టి ప్రభావం చూపే చాన్స్ :

మొత్తానికి ఇండోర్ వాయు కాలుష్య కారకాలకు గ్యాస్ స్టవ్స్ చిన్న మూలం. చాలా గృహాల్లో బయటి వనరుల నుంచి వచ్చే కాలుష్యం కంటే ఇండోర్ నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలకు గ్యాస్ స్టవ్స్ ఎక్కువగా దోహదపడతాయి. ముఖ్యంగా వంట సమయంలో ఈ ఎక్స్‌పోజర్‌ స్వల్పకాలికంగా ‘పీక్’లో ఉంటుంది. అయితే వాహనాలతో నిండిన హైవే రోడ్ కంటే కూడా మీ ఎక్స్‌పోజర్‌కు ఒక గ్యాస్ స్టవ్ ఎలా ఎక్కువ దోహదపడుతుంది? అంటే.. బహిరంగ కాలుష్యం పెద్ద ప్రాంతంలో వెదజల్లుతుంది. కానీ ఇండోర్ కాలుష్యం చిన్న ప్రదేశంలో కేంద్రీకృతమై ఉంటుంది. కనుక గ్యాస్ స్టవ్ నుంచి ఎంత కాలుష్యం పొందుతారనేది ఆ ఇంటి నిర్మాణంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా బాగా వెంటిలేషన్ ఉన్న ఇళ్లల్లో నివసించేవారు తక్కువగా బహిర్గతమవుతారు. కానీ పెద్ద గృహాలు కూడా గ్యాస్ స్టవ్ వాడకం వల్ల ప్రభావితమవుతాయి. ప్రత్యేకించి వంటగదిలోని గాలి ఇంట్లో మరెక్కడా స్వచ్ఛమైన గాలితో కలిసిపోదు. అయితే వంట చేసేటప్పుడు రేంజ్ హుడ్‌(range hood) (కిచెన్‌లోని వాయువులను బయటకు పంపే ఏర్పాటు) ఉపయోగించడం లేదా వంటగది కిటికీలు తెరవడం తదితర వెంటిలేషన్ వ్యూహాలు కాన్సంట్రేషన్స్‌ను నాటకీయంగా తగ్గించగలవు.

(Shopping malls: షాపింగ్ లో ఎక్కువ డబ్బు వృధా కాకుండా..)

మీథేన్, ప్రమాదకర వాయు కాలుష్య కారకాలు

నైట్రోజన్ డయాక్సైడ్ అనేది గ్యాస్ స్టవ్స్ నుంచి వచ్చే కాలుష్యం మాత్రమే కాదు. స్టవ్‌లు పని చేయనప్పుడు కూడా సంభావ్య ప్రభావాలతో కొంత కాలుష్యం భూ వాతావరణం, మానవులపై ప్రభావం చూపుతుంది. యూఎస్‌ వ్యాప్తంగా గ్యాస్ స్టవ్స్.. వాడుకలో లేని మీథేన్‌ (Methane) ను వాతావరణంలో దాదాపు 400,000 కార్ల వరకు వేడిని బంధించే స్థాయిలో విడుదల చేస్తాయని 2022 అధ్యయనం అంచనా వేసింది. ఇది సహజ వాయువులో ప్రధాన భాగమైన రంగు, వాసన లేని వాయువు. ఈ లీక్స్‌లో కొన్ని గుర్తించబడవు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ పేలుడు ప్రమాదానికి ముందు ప్రజలు లీక్‌ల వాసనను చూసేలా సహజ వాయువుకు వాసనను జోడించినప్పటికీ, చిన్న లీక్స్‌ విషయంలో ఆ వాసన నివాసితులు గమనించేంతగా బలంగా ఉండకపోవచ్చు. ప్రత్యేకించి కొవిడ్ 19 లేదా ఇతర కారణాల వల్ల వాసన జ్ఞానం కోల్పోయిన వారు పెద్ద లీక్స్‌ను కూడా పసిగట్టకపోవచ్చు. ఇక సహజ వాయువును లీక్ చేయడంలో క్యాన్సర్ కారక ఏజెంట్ అయిన బెంజీన్‌ సహా బహుళ ప్రమాదకర వాయు కాలుష్య కారకాలు ఉన్నాయని ఇదే అధ్యయనంలో తేలింది. బెంజీన్‌‌కు సంబంధించి లెక్కగట్టిన సాంద్రతలు ఆందోళన కలిగించే ఆరోగ్య పరిమితులను చేరుకోనప్పటికీ, ఈ ప్రమాదకరమైన వాయు కాలుష్య కారకాలు గణనీయమైన లీకేజీలు, పేలవమైన వెంటిలేషన్ (ventilation) ఉన్న ఇళ్లలో సమస్యాత్మకంగా ఉండవచ్చు.

మారడానికి కారణాలు : ఆరోగ్యం, వాతావరణం

ఈ సమస్య పరిష్కారం కోసం గ్యాస్ స్టవ్ వాడేవారు కిచెన్‌ (kitchen)లోని వాయువులు బయటకు వెళ్లేందుకు వీలుగా రేంజ్ హుడ్‌ రన్ చేయాలి. అలాగే వంట సమయంలో కిచెన్ కిటికీలను తెరవడం ద్వారా వీలైనంతగా వెంటిలేషన్‌ ఉంచుకోవాలి. ఇది కొంతవరకు సాయపడుతుంది కానీ వంటగదిలో ఉన్న ఇంటి సభ్యులకు ఎక్స్‌పోజర్స్‌ను తొలగించదు. అయితే మాగ్నెటిక్ ఇండక్షన్‌ని ఉపయోగించే గ్యాస్ స్టవ్‌ను మార్చుకోవడం వల్ల అది వాతావరణ ప్రయోజనాలను అందించడంతో పాటు ఈ ఎక్స్‌పోజర్‌ను తొలగిస్తుంది. ఇందుకోసం మల్టిపుల్ ఇన్సెంటివ్ ప్రోగామ్స్ (Multiple Incentive Programs) అందుబాటులో ఉన్నాయి. స్టవ్‌ల వంటి అధిక సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఉపకరణాల కొనుగోలుపై రాయితీలను అందిస్తున్నారు. ఈ మేరకు యూఎస్‌లోని 20 రాష్ట్రాలు సహజ వాయువుపై నిషేధాన్ని నిషేధించే చట్టాలు లేదా నిబంధనలను ఆమోదించాయి.

మీ కార్బన్ పాదముద్రను తగ్గించడానికి మీరు గృహ ఇంధన సామర్థ్య చర్యల్లో పెట్టుబడి పెడితే గ్యాస్ స్టవ్స్ నుంచి దూరంగా వెళ్లడం చాలా ముఖ్యం. కొన్ని వాతావరణ దశలు ఆరుబయట గాలి లీకేజీని తగ్గించగలవు. నివాసితులు కిచెన్ వెంటిలేషన్‌ను మెరుగుపరచకపోతే ఇండోర్ వాయు కాలుష్య సాంద్రతలను పెంచవచ్చు.

(Mental Laziness: తన భావోద్వేగాలను చెప్పలేని పరిస్థితి)

Exit mobile version