బెంగాల్‌లో పర్యటించనున్న అమిత్‌షా
క్రిస్‌గేల్.. ఈ పేరు వింటేనే క్రికెట్ అభిమానులకు కిక్ వచ్చేస్తది. ఇక టీ20 ఫార్మాట్‌లో గేల్.. బ్రాడ్‌మన్ లాంటోడని భారత్ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దివంగత డాన్ బ్రాడ్‌మన్ టెస్టుల్లో అద్భుత ఆటగాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన టెస్ట్ ఫార్మాట్ యావరేజి 99.94 ఇప్పటికీ ఆ రికార్డు పదిలంగా ఉంది. ఏ క్రికెటర్ కూడా ఆ రికార్డు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.
అలాగే టీ20ల్లో గేల్ కూడా బ్రాడ్‌మన్ లాంటి వాడనీ.. అతని ఆట రాన్రాను మెరుగుపడుతుందని సెహ్వాగ్ ప్రశంసించారు. నిన్న జరిగిన మ్యాచ్‌లో గేల్.. 63 బంతుల్లో్ 99 రన్స్ చేసి, తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ ఇన్నింగ్‌లో గేల్ 8 సిక్సర్లు బాదాడు. దీంతో పొట్టి ఫార్మాట్‌లో యూనివర్సల్ బాస్ 1000 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.