end

Bigg Boss 6: గుండె పగిలేలా ఏడ్చిన గీతూ..

Bigg Boss 6: ‘బిగ్‏బాస్ :6’ నుంచి ఇటీవలె ఎలిమినేట్ (Eliminate) అయిన గీతూ రాయల్ (Geetu Royal) సెన్సేషనల్ కామెంట్స్ (Sensational comments) చేసింది. టాప్ (Top ) 5లో ఉంటానని, కప్పు కూడా నాదే అని అనౌన్స్ (Announce)చేసుకున్న గీతూ ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంతో కొంత మందికి షాక్ (Shock)ఇచ్చింది. హౌస్‌లో ఉన్నప్పుడు నాకు ఎమోషన్స్ (Emotions) లేవు నేను ఏడవును అని చెప్పిన గీతూ.. బయటకు రాగానే వెక్కి వెక్కి ఏడ్చేసింది (cry). నేను వెళ్లనూ అంటూ గుక్కపెట్టి మరి ఏడ్చేసింది. ఎలిమినేషన్‌లో శ్రీ సత్య (Satya), గీతూ పోటీపడగా గీతూ అవుట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఓట్లు (Votes)తక్కువ పడటంతో గీతూ బయటకు వచ్చేసింది. మొదట్లో ఈమె గేమ్ (Game) చూసి చాలా మంది తిట్టుకున్నారు. నాకు అంతా తెలుసు నాకు నచ్చినట్టే ఆడతా అంటూ.. హౌస్‌లో రచ్చ చేసింది.

ఈ మేరకు తాజా ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి నిమిషం గెలవడం కోసమే ఆడానన్న ఆమె కానీ జనానికి తాను నచ్చలేదేమో అని ఫీల్ (Feel) అయింది. నాలోని లోపాలను సరి చేసుకుంటూనే వస్తున్నాను. అయినా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. హౌస్‌లో అందరితో పెద్దగా స్నేహం (Friendship) ఏర్పడటానికి ముందు నేను కాస్త దూకుడుగా మాట్లాడిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత నాలోని లోపాలను నాగార్జునగారు (Nagarjuna) చెబుతూ ఉంటే సరిదిద్దుకుంటూ వచ్చాను అని తెలిపింది.

అలాగే ‘సిగరెట్లు(Sgarate), లైటర్ (Lighter) దాచేసినందుకు నన్ను బాలాదిత్య (Baladitya)చాలా మాటలు అన్నాడు. నేను నటిస్తున్నానని ఆయన అన్న మాటలు నాకు చాలా బాధ కలిగించింది. నేను హర్ట్ (hurt)అయ్యాను. అందువల్లనే గేమ్ అయిపోయిన వెంటనే కూడా తిరిగి ఆయనకి లైటర్,  సిగరెట్లు ఇవ్వలేదు. నేను ఎవ్వరిని పర్సనల్‌గా టార్గెట్ (Target) చేయను. ఎవరి ఎమోషన్స్‌ను హర్ట్ చేయను. చేపల టాస్క్‌లో సంచాలక్‌గా (Sanchalak) నేను వ్యవహరించిన తీరు తప్పంటే ఒప్పుకోనూ అలాగే బాలాదిత్య విషయం కారణంగానే నేను ఎలిమినేట్ అయ్యాను అంటే కూడా ఒప్పుకోనూ. నేను మొదటి నుంచి నాలానే ఉన్నా’ అంటూ వివరించింది.

ఇదిలావుంటే.. మొదట్లో ఆటలోకి వస్తే అమ్మనాన్న (parents) గురించి ఆలోచించకుండా గెలవడానికే ప్రయత్నిస్తాను అంటూ ముందు నుంచి చెప్పింది. ప్రతి క్షణంపై గేమ్ పైనే ఫోకస్ (Focus) పెట్టింది. బిగ్‏బాస్ విన్నర్ (Winner)కావాలనుకుంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ ఆటను తన స్టైల్లో ఆడింది. బుద్ది బలమే తన గేమ్ ప్లాన్ (game plan) అంటూ చివరికి మధ్యలోనే డ్రాప్ (drop) అయ్యింది. బిగ్‏బాస్ విన్నర్ కావాలని ప్రతి క్షణం కలవరించి.. ప్రతి అమ్మాయికి ఆదర్శంగా ఎన్నో కలలు కన్న గీతూ రాయల్ చివరకు తొమ్మిది వారాలకే (Weeks)బయటకు వచ్చేసింది. ఇక తన ఎలిమినేషన్ అస్సలు ఊహించలేకపోయిన గీతూ.. గుండె పగిలేలా ఏడ్చింది. నేను పోను.. బిగ్‏బాస్ వదిలి వెళ్లను అంటూ స్టేజ్ (Stage) పైనే కూర్చుండి పోయింది. ఇక ఆమెను ఓదార్చడం నాగార్జున వల్ల కూడా కాలేదు. ఆదివారం (sunday) ఎపిసోడ్‏లో (episode)హౌస్ మొత్తం భావోద్వేగంతో నిండిపోయింది. స్ట్రాంగ్ కంటెండర్ (strong Catender)అయిన గీతూ ఎలిమినేషన్‏తో రేవంత్ (Revanth), ఆదిరెడ్డి (Adhi reddy) ఫైమా (fima)వెక్కి వెక్కి ఏడ్చారు.

(Nizamabad:యూట్యూబ్ క్లాసెస్ విని నీట్ ర్యాంక్ కొట్టిన యువతి..)

ఒక్కొక్కరిని హోస్ట్ (Host) నాగార్జున సేవ్ (save) చేస్తూ రాగా.. చివరగా గీతూ, శ్రీ సత్య మిగిలారు. దీంతో తాను కచ్చితంగా ఎలిమినేట్ అవుతానంటూ భావోద్వాగానికి గురయ్యింది శ్రీసత్య. కానీ అనుహ్యంగా గీతూ రాయల్ ఎలిమినేటెడ్ అని చెప్పేశాడు నాగ్. దీంతో ఆమె ఆ మాటలు వినలేక చెవులు మూసుకుంది. నెక్ట్స్ వీక్ (next week) కెప్టెన్ (Captain)అవుదామనుకుంటే పంపించేస్తున్నారేంటీ బిగ్‏బాస్ అని ఏడ్చేసింది. నేను బాధపెట్టి ఐయామ్ సారీ (sorry).. అంటూ తనకు నచ్చిన స్థలాల్లో కుర్చొని బాధపడింది. ఐ లవ్ యూ (I Love You Bigg Boss) బిగ్‏బాస్.. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను నాకు పోవాలని లేదంటూ బోరుమని ఏడ్చింది. ఇక గీతూ ఎలిమిషన్ అస్సలు ఊహించని ఆదిరెడ్డి, ఫైమా, రేవంత్, శ్రీసత్య ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ప్రతి నిమిషం ప్రత్యర్థుల్లా ఉండే రేవంత్, గీతూ ఎలిమినేట్ కాగానే దుఃఖం ఆపులేకపోయారు. ప్రతి నిమిషం ప్రాణం పెట్టి ఆడాను. నిద్రలో కూడా బిగ్‏బాస్ షో గెలవాలనే అనుకున్నాను. కానీ ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని కలలో (dream)కూడా అనుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం స్టేజ్ పైకి వచ్చిన గీతూకి.. తన బిగ్‏బాస్ జర్నీ (Journy)చూపించాడు నాగార్జున. తన వీడియో (video)చూస్తూ దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది.

ఇక తర్వాత బాధపడుతూనే.. ఆది, రేవంత్, సత్య, ఫైమా, శ్రీహాన్ టాప్ 5 అని.. వీరి వల్ల షో ఇంట్రెస్టింగ్‌ (Interesting)గా ఉంటుందని చెప్పింది. ఇక ఇనయ (Inaya), మెరీనా (Merina), రోహిత్ (Rohit), రాజ్ (Raj), కీర్తి (Keerthi)ల గేమ్ తక్కువగా ఉందని చెప్పుకొచ్చింది. చివరగా నేను పోను.. బిగ్‏బాస్ వదిలి వెళ్లను అంటూ ఏడుస్తూ స్టేజ్ పైనే కూర్చుండిపోయింది. ఆమెను ఓదార్చడం నాగార్జున వల్ల కాలేదు. ఆమె ఏడుస్తుంటే చూస్తూ నిల్చుండిపోయాడు. మొదటి రెండు వారాలు గీతూ తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాతి వారం నుంచి ఆమె గ్రాఫ్ (Graph)స్లోగా పడిపోయింది. ముఖ్యంగా గతవారం గీతూ తన ఆట తీరు.. ప్రవర్తనపై విసుగు చెందారు ఆడియన్స్ (Audions). బాలాదిత్యతో సిగరెట్స్ గొడవ.. ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే బాలాదిత్య గీతూ వల్ల వెక్కి వెక్కి ఏడవడం.. పూర్తిగా నమ్మి స్నేహం చేసిన ఆదిరెడ్డిని తన బుద్దిబలంతో వెన్నుపోటు పొడవడం గీతూకు మైనస్ అయ్యాయనే చెప్పుకోవాలి.

Exit mobile version