end
=
Saturday, January 18, 2025
విద్యా సమాచారంGeneral Knowledge:జనరల్ నాలెడ్జ్
- Advertisment -

General Knowledge:జనరల్ నాలెడ్జ్

- Advertisment -
- Advertisment -

Indus : సింధూనది టిబెట్లోని కైలాస్ (Kailash in Tibet) వరుసలో మానససరోవరం (Manasasarovaram) వద్ద పుట్టింది.

  • అక్కడి నుండి పశ్చిమానికి ప్రవహించి, జమ్మూ-కాశ్మీర్‌ని దాటి..పాకిస్థాన్లో ప్రయాణించి తర్వాత అరేబియా సముద్రంలో కరాచీ వద్ద కలుస్తుంది.
  • ఈ నది మొత్తం పొడవు – 2880 km.
    ఇందులో మన దేశంలో జమ్మూ కాశ్మీర్ లో 709km ప్రయాణిస్తుంది.
  • ఈ సింధూనది జమ్మూ కాశ్మీర్ లో నంగ ప్రభాత్ పర్వతాన్ని తాకుతూ వెళ్తుంది.
  • ఈ సింధూ నదికి కుడి వైపున ఉన్న ఉపనదులు వరుసగా
  1. జీలం
  2. చీనాబ్.
  3. రావి.
  4. బియాస్
  5. సట్లేజ్
  6. జీలం నది :
  • ఇది జమ్మూ-కశ్మీర్ (Jammu and Kashmir) లో పిర్‌పంజాల్ (Pirpanjal) వరుసలో పుట్టి పశ్చిమానికి వెళ్ళి పాకిస్థాన్లో సింధూ (Indus in Pakistan) లో కలిసింది.
  1. చీనాబ్ నది : (River Chenab)
  • ఇది హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh) లో బారాలాచా లా కనుమల్లో పుట్టి పాకిస్థాన్
    సింధూనదిలో కలిసింది.ఇది సింధు ఉపనదుల్లో కెల్లా పెద్ద ఉపనది
  1. రావి నది :
  • ఇది కూడా హిమాచల్ ప్రదేశ్‌లో కులూ కనుమలులో పుట్టి పాకిస్థాన్‌లో లాహోర్ నగరం గుండా ప్రయాణించి, సింధూ నదిలో కలుస్తుంది.
  • అందువల్ల రావి నదిని లాహోర్ నది అని కూడా అంటారు.
  1. బియాస్ నది :
  • ఇది కూడా హిమాచల్ ప్రదేశ్ లో కులూ కనుమ లో పుట్టి, ఇది పాకిస్థాన్ గుండా
    వెళ్ళని సింధూ ఉపనది.
  • ఇది సట్లేజ్ నదిలో పంజాబ్ లోని కపుర్తలా జిల్లాలో హరికే అనే ప్రాంతంలో కలుస్తుంది.

(PM Modi:ఫిబ్రవరి 13న హైదరాబాద్‌‌కు మోడీ!)

  1. సట్లెజ్ నది:
  • ఇది మన దేశంలో పుట్టని సింధూ ఉపనది.
  • టిబెట్లోని కైలాస్ శ్రేణిలో లోయ వద్ద పుట్టి మన దేశం గుండా వెళ్తూ, బియాస్ నదిని కలుపుకొని పాకిస్థాన్ లోకి వెళ్ళింది.
  • సట్లెజ్ నది సింధూ ఉపనదుల్లో కెల్లా పొడవైన ఉపనది.

బ్రహ్మపుత్రా నదీ వ్యవస్థ:

  • ఇది కూడా టిబెట్ కైలాస్ శ్రేణిలో మానస సరోవరానికి దగ్గర్లో ఉన్న
    చమయంగ్ డాంగ్మ్ అనే ప్రాంతంలో పుట్టి తూర్పుకు ప్రవహించుకుంటూ వెళ్ళి,
    మనదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రెండు రాష్ట్రాలు దాటి, బంగ్లాదేశ్ లోకి
    ప్రవేసిస్తుంది.
  • ఈ నది మొత్తం పొడవు – 2900km.
  • ఇందులో మన దేశంలో రెండు రాష్ట్రాల్లో 885 km ప్రయాణిస్తుంది.
    ఈ నది బంగ్లాదేశ్ లో ప్రవేశించగానే జమునా నదిగా పిలువబడుతుంది.
    పద్మానదితో కలిసిన తర్వాత మేఘన నదిగా పిలువబడుతుంది..

బ్రహ్మపుత్ర నదికి వివిధ పేర్లు:

  • టిబెట్‌లో- యార్లాంగ్ త్సాంగ్‌పో (టిబెట్ భాషలో శుద్ధి చేసేవాడు అని అర్థం.
  • అరుణాచల్‌ప్రదేశ్- దిహంగ్
  • అసోం- సైడంగ్
  • బంగ్లాదేశ్‌లో గంగానది (పద్మానది)తో కలిసిన తర్వాత (రెండింటినీ కలిపి)- మేఘన
  • చైనా- యార్లాంగ్ జాంగ్‌బో జియాన్‌జిన్
  • ఇండియా- రెడ్ రివర్

(Seedat:లక్ష రూపాయల జీతంతో ఇంజనీర్ పోస్టులు)

బ్రహ్మపుత్ర ఉపనదులు:
బ్రహ్మపుత్ర నదికి ఉత్తరాన కలిసే ఉపనదులు: తీస్తా, మానస, గంగాధర్, బేల్‌సిరి, ధరణ్‌సిరి, సుభనసిరి
దక్షిణవైపు నుంచి కలిసే ఉప నదులు: దిబ్రూ, డిక్కు, దిహంగ్
పర్వతీయ నది: రాగాత్సాంగ్‌పో
బ్రహ్మపుత్ర నదికి అసోం దుఃఖదాయని అనే పేరు ఉంది. (ఇది దిశను మార్చుకొని భయంకర వరదతో ప్రవహిస్తుంది)
బ్రహ్మపుత్ర నది చైనా, ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య వివాదాస్పదమైనది.
ఈ నది అసోంలో మాజోలి అనే ద్వీపాన్ని ఏర్పర్చింది. దీని విస్తీర్ణం 1250 చ.కి.మీ.
ఇది ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం
ఈ నది పరీవాహక ప్రాంతంలోని జోర్హాట్ జిల్లాలో కజిరంగా నేషనల్ పార్క్ (1905 – 2005 వందేండ్లు పూర్తి) ఉంది. ఇది ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి.
బ్రహ్మపుత్ర నది S ఆకారంలో ప్రవహిస్తుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -