Nims Hospital : పంజాగుట్ట నిమ్స్‌లో ఆస్పత్రిలో వయోజన వ్యాక్సినేషన్ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. సోమవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జనరల్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ నవల్ చంద్ర, డైరెక్టర్ నగరి బీరప్ప (dr beerappa nims) గారితో కలిసి ప్రారంభించారు. (Clinic) ఈ క్లినిక్ ద్వారా అంటు వ్యాధులను నివారించడంతో పాటు ఇమ్యునైజేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రతి ఒక్కరికి అవసరమైన (Nims Hospital) టీకాలను అందించేందుకు వీలు కలుగుతున్నదని వారు తెలిపారు. రోగనిరోధక వ్యవస్థ మార్పులు, అనారోగ్య భారిన పడిన వారికి ఉపశమనం కల్పిచేందుకు ఈ టీకాలు ఉపయోగపడుతాయన్నారు. దీర్ఘకాలికంగా రోగాలతో పోరాడుతున్న వారు (Panjgutta Nims) వ్యాధులు నయం కాకపోవడంతో ఏటా 25 లక్షల మందికి పైగా మృతి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కలు చెబుతున్నాయి.
ఈ క్లినిక్ సాయంతో వేగంగా అంటు వ్యాధులను గుర్తించి టీకా సాయంతో పూర్తిగా నయం చేయడంతో పాటు ఆరోగ్య రక్షణ కోసం సూచనలు చేసేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. వయోజన (vaccination) వ్యాక్సినేషన్ క్లినిక్ సేవలు సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగంచేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, డీన్ లిజా రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ శాంతి వీరు, జనరల్ మెడిసిన్ సీనియర్ ప్రొఫెసర్ సత్యనారాయణ రాజు, డాక్టర్ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.