- అక్రమ చొరబాటుదారులను అరికట్టేందుకే కఠిన నిర్ణయం
- ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
Adhar in Assam : అసోంలో అక్రమ వలసలు, చొరబాటు అరికట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది. ఆసోంలో(Assam) ఇక అధార్‌ను(Adhar) కఠినతరం చేస్తూ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sharma) నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా అధార్ కార్డు పొందాలనుకునే వారు తప్పనిసరిగా జాతీయ పౌర నమోదు నంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానుంది.
అసోంలో అక్రమ వలసలు ఉన్నాయని, అనుమానిత వ్యక్తులు ఇందులో ఉన్నట్లు అర్థమవుతోందని ముఖ్యమంత్రి అన్నారు. జనాభా కంటే ఆధార్ కార్డు అప్లికేషన్లు ఎక్కువ ఉన్నట్లు తన దృష్టికి వచ్చినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు. ఇక ఆధార్ జారీ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
కాగా అసోంలో బయోమెట్రిక్ లాక్(Biometric Lock) అయిన 9.55 లక్షల మందికి ఎన్‌ఆర్‌సి (NRC) అప్లికేషన్ నెంబర్ జత పరచనవసరం లేదని తెలిపారు. వీరికి మాత్రం ఆధార్ కార్డు జారీ అవుతుందని సీఎం తెలిపారు. గతంలో కూడా చాలా మంది బంగ్లాదేశీయులను(Bangladeshians) పట్టుకొని ఆ దేశ అధికారులకు అప్పగించామని ముఖ్యమంత్రి తెలిపారు.