- తెలంగాణ హైకోర్టు (HighCourt) GHMC అధికారులపై మండిపాటు
- కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు
Amberpet : అంబర్‌పేటలో వీధి కుక్కల(Dogs Attack) దాడిలో బాలుడు మృతి(Child Died) చెందిన కేసును తెలంగాణ హైకోర్టు సుమోటో(SUMOTO)గా స్వీకరించింది. మూడు రోజుల క్రితం అంబర్‌పేటలో ఓ నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయగా ఆ బాలుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని హైకోర్టు చాలా సీరియస్‌గా తీసుకుంది. ఒక్కసారిగా రాష్ర్ట వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందారు. వీధికుక్కల(Street Dogs) నియంత్రణకు జీహెచ్‌ఎంసీ (GHMC) ఏం చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది.
జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే బాలుడు చనిపోయాడని హైకోర్టు(High Court) తెలిపింది. ఇలాంటి దయనీయ పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు జీహెచ్‌ఎంసీ అధికారులకు అదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ(Telangana CS), హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్‌సెల్, తదితర అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై పూర్తి విచారణ జరిపి కౌంటర్ దాఖలు కోర్టుకు సమర్పించాలని కోరింది. కాగా ఈ కేసును మార్చి 16వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.