హైదరాబాద్: మొన్నటి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార హోరుతో సిటీని మొత్తం హోరెత్తెంచాయి. డిసెంబర్ 1న గ్రేటర్ పోలింగ్ జరగ్గా.. ఇవాళ ఫలితాలు వెల్లడవుతాయి. కాగా, ఆయా పార్టీలు విజయం మాదే అంటే మాదే అంటూ చంకలు గుద్దుకుంటున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ.. ఖచ్చితంగా గ్రేటర్‌లో గెలిచేది మేమే.. మేయర్ పీఠం మాదే అంటూ ఘంటాపథంగా చెబుతున్నాయి. ఇక అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ.. టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాలి. రాష్ట్ర నాయకులతో పాటు, ఢిల్లీ నాయకులను ప్రచారంలో దించి ఆ పార్టీ ఉనికిని చాటుకుంది.
ఎంఐఎం నాయకులు ఓల్డ్ సిటీకే పరిమితమవకుండా మరికొన్ని చోట్ల తమ ప్రతాపాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం, టీఆర్ఎస్ విడివిడిగా బరిలోకి దిగినప్పటికీ.. వారి మధ్య సఖ్యత అలాగే ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చూడాలి మరి గ్రేటర్‌లో పాగా వేసేదెవరో..?