మగవారితో పోలిస్తే మహిళలకు ప్రత్యేకమైన ఆహారం అవసరం. వారి శరీర పనితీరు సక్రమంగా సాగాలంటే కచ్చితంగా ఈ ఆహార పదార్థాలు తినాలి వాటిలో కొన్ని..
పాలకూర: స్త్రీలు పాలకూర(Lettuce)ను చూడగానే ముఖం అదోలా పెడతారు కానీ.. స్త్రీలకు పాలకూర తినాల్సిన అవసరం చాలా ఉంది. ఇందులోని మెగ్నీషియం.. పీఎమ్‌ఎస్(Premenstrual syndrome) లక్షణాలను అడ్డుకుంటుంది. అలాగే ఎముకల పటుత్వానికి, ఆస్తమా రాకుండా ఉండేందుకు, రక్తపోటును నియంత్రించేందుకు కూడా పాలకూరలోని పోషకాలుఉపకరిస్తాయి.
అవిసె గింజలు: మార్కెట్లో తక్కువ ధరకే దొరుకుతాయి అవిసె గింజలు(Hemp seeds). ఇవి గుండెకు చాలా మంచిచేస్తాయి. ఇందులో ఒమెగా 3 ఫాటీ ఆమ్లాలు(Omega 3 fatty acids) పుష్కలం. అలాగే వాపును, నొప్పిని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా కలిగి ఉంటాయి. రోజూ వీటిని తినడం స్త్రీలకు చాలా మంచిది. మలబద్ధకం సమస్య నుంచి ఇవి ఉపశమనం కలిగిస్తాయి.
క్రాన్‌బెర్రీస్: ఎర్రగా, ఆకర్షవంతంగా ఉండే పండ్లు క్రాన్‌బెర్రీస్(Cranberries). మహిళల్లో తరచూ వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌ను ఇవి చెక్ పెడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
టొమాటో: టొమాటో మనకు నిత్యం అందుబాటులో ఉండే కూరగాయ(పండు). అలాగని వాటిని చిన్నచూపు చూడకండి. ఇది ఎంతో శక్తివంతమైన పండు. ఇందులోని లైకోపీన్ అనే పిగ్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్(Breast Cancer), గుండె జబ్బులు రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఓట్స్: ప్రీమెన్‌స్ట్రుల్ సిండ్రోమ్’ వల్ల కలిగే భావోద్వేగాలను ఓట్స్(oats) నియంత్రిస్తాయి. గుండెకు మేలు చేయడంతో పాటూ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఓట్స్ ఎంత తిన్నా లావెక్కుతారన్న భయం ఉండదు. కాబట్టి రోజూ తినొచ్చు. పైగా బరువు కూడా అదుపులో ఉంటుంది.