- ఉత్తర్‌ప్రదేశ్‌లోని శారదనది వద్ద ఘటన
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లో విషాధం చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలు నది ఒడ్డున మట్టిని తవ్వుతు ఉండగా ఒక్కసారిగా మట్టి వదులుకావడంతో ఆ మట్టిలో కూరుకుపోయారు(stuck in mud). లింఖిపూర్ ఖేరిలో(linkhipur) భిరా కొత్వాలి(bhirakotwali) పరిధిలోని శారదనది (Sharada River) ఒడ్డున ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఐదుగురు బాలికలు శారదనది వద్దకు మట్టి సేకరించడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు బాలికలు పూనమ్‌దేవి(PoonamDevi) (12), శివానీ(Shivani) (13) మట్టికింది కూరుకుపోయి మరణించారు. బాలికల అరుపులు వినిపించడంతో స్థానికులు పరుగునా వెళ్లారు.
(Jaya Bachchan:పెళ్లికి ముందే పిల్లలను కంటే తప్పేముంది)
కాగా మరో వీరితోపాటు ఉన్న మరో ముగ్గురు బాలికలు నైరా, నిక్కీ, నైన్సీలను స్థానికులు రక్షించారు. ఊపిరాడక పూనమ్ అక్కడిక్కడే మృతి చెందగా మిగిలిన నలుగురు బాలికలను బిజువాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి(Primary Health Center) తరలించగా చికిత్స పొందుతూ శివానీ కూడా మృతి చెందింది. అయితే మృతదేహాలను పోస్టుమార్టం(Postmartom) నిమిత్తం తరలించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు పూనమ్‌దేవీ, శివానీ మృతదేహాలను అప్పగించినట్లు భిరా కొత్వాల్ ఇన్‌ఛార్జ్ విమల్‌కుమార్‌గౌడ్ తెలిపారు.