end
=
Friday, November 22, 2024
క్రీడలుHyderabad:హైదరాబాద్‌లో గ్లోబల్ రేస్ ఈవెంట్‌
- Advertisment -

Hyderabad:హైదరాబాద్‌లో గ్లోబల్ రేస్ ఈవెంట్‌

- Advertisment -
- Advertisment -

  • శనివారం నుంచి  ఫార్ములా-ఈ ట్రయల్‌ రన్‌
  • స్పెషల్‌గా ముస్తాబైన హుస్సేన్ సాగర తీరం

శనివారం నుంచి హైదరాబాద్‌(Hyderabad) లో ఫార్ములా-ఈ ట్రయల్‌ రన్‌ (Formula-E trial run) గ్రౌండ్ సిద్ధమైంది. స్పెషల్‌గా ముస్తాబైన హుస్సేన్ సాగర తీరం (Hussain Sagar )లో రోడ్డెక్కిన రేసుగుర్రాలు గేర్లు మార్చుకుంటున్నాయి. గెట్‌సెట్‌గో సౌండ్‌ కోసం వియ్యార్ వెయిటింగ్ అంటున్నాయి. భాగ్యనగరంలో జరిగే గ్లోబల్ రేస్ ఈవెంట్‌ (Global race event)కి కౌంట్‌డౌన్ మొదలైంది. విశ్వ నగరాల జాబితాలో చేరడానికి సిద్ధమవుతున్న హైదరాబాద్‌లో రేసర్లు, రేస్ అభిమానుల పాలిట పండగకు సర్వం సిద్ధమైంది.

భాగ్యనగరం నడిబొడ్డున తొలిసారి అంతర్జాతీయ స్థాయి ఫార్ములా రేస్‌ (International level Formula Race)కి.. టోటల్ గ్రౌండ్ సిద్ధమైంది. రేపే హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్‌ ట్రయల్‌ రన్‌. మధ్యాహ్నం 3.10 గంటలకు ముహూర్తం.. హైదరాబాద్ మోటార్ రేస్ లవర్లకు ఇదొక గోల్డెన్ మూమెంట్. డిసెంబర్‌లో సెకండ్ ట్రయల్ రన్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి (February)లో అసలు రేస్‌.. షురూ ఔతుంది. దానికి వామప్ (Warmup race)రేసే శనివారం జరగబోయే ట్రయలర్ రన్-1. ఇందుకోసం స్పెషల్‌గా ముస్తాబైంది హుస్సేన్ సాగర తీరం. రేస్‌ కార్లు రయ్‌.. రయ్‌మంటూ దూసుకుపోయేందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో పవర్‌ఫుల్ ట్రాక్ రెడీ అయ్యిందిక్కడ. లండన్‌, ప్యారిస్‌, మొనాకో, బెర్లిన్‌ (London, Paris, Monaco, Berlin)నగరాల్లోని రేస్‌ సర్క్యూట్స్‌కి ఏమాత్రం తగ్గకుండా హుస్సేన్‌ సాగర్‌ దగ్గర రేసింగ్‌ ట్రాక్‌ను సిద్ధం చేశారు. EV టెక్నాలజీ (EV Technology)పై అవగాహన పెంచడానిక్కూడా ఫార్ములా-ఈ రేసింగ్‌ ఉపయోగపడుతుందన్నది అధికారుల అంచనా.

(Casino Case:తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోన్న చీకోటి లింకులు)

ఎంత మంది రేసర్లో తెలుసా..

ఇంతకీ ఈ ట్రాక్‌పై హల్‌చల్ చెయ్యబోయే రేసింగ్ కార్‌ ఎలా ఉంటుంది.. దీని స్టీరింగ్‌ని రైడర్‌ ఎలా కంట్రోల్ చేస్తారు..? సగటు రేస్ అభిమాని కలలు గనే రేరెస్ట్ ఫీల్ అది. అయితే ఫార్ములా-ఈ ట్రయల్ రన్ కోసం ఇటలీ (Italy) నుంచి 14మంది రేసర్లు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. వాళ్లకు సంబంధించిన స్పోర్ట్స్ (Sports cars)కార్లూ ల్యాండయ్యాయి. ఈ రేసింగ్ కార్లను ప్రత్యేకంగా దుబాయ్‌ (Dubai)నుంచి హెవీ డ్యూటీ కారియర్ల ద్వారా కట్టుదిట్టంగా హైదరాబాద్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేశారు. మొత్తం 11 టీమ్‌లు (11 Teams) పాల్గొనబోయే ఈ రేస్‌లో ఒక్కో టీమ్‌లో రెండేసి కార్లు, నలుగురు డ్రైవర్లు ఉంటారు. ఇండియాకు (Indians)చెందిన 10 మంది ఈ రేస్‌లో పార్టిసిపేట్ (Patriespae)చేస్తారు.

అదరహో అనే రేంజ్‌లో..

వీళ్లలో ఏడుగురు మహిళా రేసర్లు (Women racers). 2.8 కిలోమీటర్ల లూప్, దాదాపు 30కి పైగా రౌండ్స్.. 45 నిమిషాల రేసింగ్.. అదరహో అనే రేంజ్‌లో ఉండబోతోంది భాగ్యనగరంలో ఫార్ములా-ఈ. విజిటర్స్‌ కోసం 30 వేలకు పైగా సీట్లు ఏర్పాటయ్యాయి. రేస్ నడుస్తున్న సమయంలో అవసరమైన పిట్‌స్టాప్స్, ప్రేక్షకులు (Audience)రేస్‌ను చూడ్డానికి వీలుగా సీటింగ్, ఫెన్సింగ్ (Seating, fencing)నిర్మాణం చేపట్టారు. ట్రాక్‌ టెస్టింగ్‌, గ్యాలరీ, సేఫ్టీ బారికేడింగ్‌ (Track testing, gallery, safety barricading)లాంటివన్నీ కంప్లీట్ చేశారు.19న మధ్యాహ్నం (Afternoon)3.10కి తొలి రేస్‌ పది నిమిషాల తర్వాత రెండో రేస్‌ (Second race)షురూ ఔతుంది. 4గంటల నుంచి 45 నిమిషాల పాటు ఇంకో లీగ్‌ కూడా ఉంటుంది. ఇంతకీ ఈ రేసును ప్రత్యక్షంగా చూడాలంటే ఎంత ఖర్చవుతుంది? రెగ్యులర్ టికెట్ పాస్ (Ticket pass)అయితే 749 రూపాయలు రెండు రోజుల పాస్ అయితే 1249 రూపాయలు.

ట్రాఫిక్ ఆంక్షలు..

శని, ఆదివారాల్లో (saturday and sunday)జరిగే ఫార్ములా-e ట్రయల్ రన్‌ టోటల్ హైదరాబాద్‌ వెయిట్ చేస్తోంది. ఇటు రేస్ కారణంగా ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కుల్ని ఇవాళ్టి నుంచి 20వ తేదీ వ‌ర‌కు మూసివేశారు. నవంబర్ 21వ తేదీ నుంచి య‌థావిధిగా పార్కులు తెరుచుకుంట్రాయి. డిసెంబర్‌లో జరిగే సెకండ్ ట్రయల్‌ రన్‌కి ముందు మళ్లీ ట్రాక్‌ను పునరుద్ధరిస్తారు.

(Beer:‘బీర్‌’తో అల్జీమర్స్ వ్యాధి మాయం)

రేసింగ్ రూట్ ఇలా..

అటు రేసింగ్ పోటీల కోసం నవంబర్‌16 నుంచే ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగుత‌ల్లి జంక్షన్ల (NTR Marg, Tank Bund, Necklace Road, Telugu Talli Junction)వ‌ద్ద ట్రాఫిక్‌ను డైవర్ట్(Divert traffic)చేశారు. ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయని, అనసవసరంగా ఆ రూట్‌లలో వెళ్లి ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు అధికారులు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఫార్ములా ఈ ఛాంపియన్‌ షిప్‌ పోటీలతో విశ్వ నగరాల జాబితాలో చేరబోతోంది హైదరాబాద్. సో భాగ్యనగరంలో రయ్‌.. రయ్‌మంటూ దూసుకుపొయ్యే రేస్‌ కార్లకు సైడ్ ఇస్తూ రేస్ మూమెంట్స్‌ని ఎంజయ్ చెయ్యడానికి రెడీ అంటున్నారు హైదరాబాదీ రేస్ లవర్స్.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -