end
=
Thursday, September 19, 2024
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
- Advertisment -

ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

- Advertisment -
- Advertisment -

మహేశ్వరం: మండల కేంద్రంలోని శ్రీ శివ గంగ రాజరాజేశ్వరి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. భక్తులు తెల్లవారుజామునే దేవాలయానికి విచ్చేసి దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ పేయల నరసింహ మాట్లాడారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారని తెలిపారు.ఈ దేవాలయం చాలా పురాతనమైనదని, నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారని ఆయన తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలని నర్సింహ కోరారు.

భక్తుల కోరికలు తీర్చే ఇలవేల్పు ఈ దేవాలయం అని, అందుకే భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా చైర్మన్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ శివ గంగ రాజరాజేశ్వరి దేవాలయం చైర్మన్ డాక్టర్ పేయల నర్సింహతో పాటు కరేళ్ళ చంద్రయ్య, కర్నాటి మనోహర్, పిఏసిఎస్ డైరెక్టర్ కడమోని ప్రభాకర్, పున్న యాదయ్య, దొడ్డు కృష్ణయ్య, జి రమేష్, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -