ప్రముఖ తెలుగు గాయని సునీత, డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అమ్మపల్లి సీతారాముల ఆలయంలో శనివారం రాత్రి వీరి పెళ్లి జరిగినట్లు తెలిసింది. సునీత పెళ్లికి పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లిలో ఇటీవల వివాహం చేసుకున్న టాలీవుడ్ హీరో నితిన్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సునీత ఇద్దరు పిల్లలు ఆమె దగ్గరుండి వివాహం జరిపించడం విశేషం. కాగా, సునీత-రామ్ వీరపనేని డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. వీరు ఇటీవలే సినీ పరిశ్రమలోని సన్నిహితులకు ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చారు.