end
=
Thursday, November 21, 2024
ఫీచ‌ర్స్ ‌వంటలుGoat Head Curry: ఎంతో రుచీకరమైన తలకాయ కూర
- Advertisment -

Goat Head Curry: ఎంతో రుచీకరమైన తలకాయ కూర

- Advertisment -
- Advertisment -

తలకాయ కూర ఆరోగ్యానికి చాలా మంచిది. తలకాయ కూర సూప్ తాగినా కూడా చాలా ప్రయోజనలు(Benefits) ఉంటాయి. ఎక్కువగా మోకాళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు మేక కాళ్ల సూప్ తాగాలని డాక్టర్లు చెప్తున్నారు.ఈ సూప్ తాగితే జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. ఈ సూప్ లో ఉండే గ్లూకోసమైనన్, హైఅలురోనిక్ యాసిడ్, కొండ్రోయిటిన్ వల్ల కీళ్ల నొప్పుల(Joint Pains)ను తగ్గుమఖం పట్టేలా చేస్తాయి. సూప్ తాగడం వల్ల జలుబు గొంతునొప్పి కూడా పోతుంది అలాగే రోగ నిరోధక శక్తి(Immunity Power) కూడా పెరుగుతుంది.తలకాయ కూరను భిన్నమైన వాసన కల్గి ఉండటం వల్ల చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ ఇది ఆరోగ్యనికి చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు(Pregnant ladies) తలకాయ కూరను తింటే లోపలి పిండం మంచిగా పెరుగుతుందని తల్లికి పాలు పడతాయని పెద్దవాళ్లు అంటుంటారు. మీకు తినాలి అనిపిస్తుందా అయితే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

ఈ కూర కి కావల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. ఒక పాన్ లో కొన్ని ధనియాలు, ఆరు లవంగాలు, మూడు యాలకులు, చిన్న దాల్చిన చెక్క తీసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.తర్వాత కుక్కర్లో సరిపడా నూనె వేసి ఒక జాజిపువ్వు(Nutmeg), బిర్యానీ ఆకులు వేసి కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేగాక అల్లం ముద్ద(Ginger paste) వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.

(వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో…)

తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి.నాలుగు పచ్చిమిర్చిలను చీలికలుగా కట్ చేసుకొని వేసి బాగా వేయించుకున్న తరువాత ఇందులో కడిగి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో అర స్పూన్ పసుపు, సరిపడా కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ముక్కలు మునిగేదాక నీరు పోసి బాగా కలుపుకొని కుక్కర్ కి మూత పెట్టుకొని 5నుండి 6 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. మనం పక్కన పెట్టుకున్న మెదడు వేయాలి. మెదడు ని ఎప్పుడు ఐనా చివరలో లోనే వేయాలి. మెదడు వల్ల కూర కి చిక్కదనం మంచి రుచి వస్తుంది.తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసి బాగా కలుపుకొని చివర్లో కొత్తిమీర(Coriander) వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్ లో ఉండనివ్వాలి. అంతే ఎంతో రుచీకరమైన తలకాయ కూర రెడీ. మీరు ట్రై చేసి చూడండి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -