end
=
Friday, August 2, 2024
వార్తలురాష్ట్రీయందేవుడి తర్వాత దేవుడు డాక్టర్‌
- Advertisment -

దేవుడి తర్వాత దేవుడు డాక్టర్‌

- Advertisment -
- Advertisment -
  • ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్‌స్పెక్టర్‌ రాంచందర్‌

  • విద్యనగర్‌ ఏఎంఎస్‌ దవాఖానలో ట్రాఫిక్‌పై అవగాహన

హైదరాబాద్‌ : తల్లి జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు దేవుడి తర్వాత దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అది వైద్యుడు మాత్రమే అని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాంచందర్‌ అన్నారు. బుధవారం ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బేగంపేట సిబ్బంది ఆధ్వర్యంలో (Vidyanagar) దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఆంధ్ర మహిళా సభ స్కూల్ ఆఫ్ నర్సింగ్ వైద్య సిబ్బంది, విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు, నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ద్వారా అవగాహన కల్పించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అందుకు రహదారులపై విధిగా (Traffic) ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. సిగ్నల్ పడ్డప్పుడు ఆగే ఓపిక కూడా వాహనదారులకు లేకుండా పోతుండటం బాధాకరమని పేర్కొన్నారు. తొందరగా వెళ్లాలనే  ఆతృత మాత్రమే ఉందని, (roads) రోడ్డు ప్రమాదాలకు జరుగుతాయని ఏ మాత్రం ఆలోచించకుండా ముందుకు పోవడం సరైన పద్దతి కాదని చెప్పారు.

 

ముఖ్యంగా రెడ్ సిగ్నల్ (signal) పడినప్పుడు తప్పనిసరిగా వాహనం ఆపి గ్రీన్‌ సిగ్నల్‌ పడినప్పుడు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో 2022లో 42,261, 2023 లో 65,413 సిగ్నల్ జంపింగ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపొద్దని, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 5000 జరిమానా, మూడు నెలల జైలు శిక్ష కూడా విధిస్తారని చెప్పారు.

 

2023 సంవత్సరంలో 6173 మంది, 2024 సంవత్సరంలో 3500 మంది (driving licence) డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి టి. టి. ఐ బేగంపేట్ నందు కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని చెప్పారు. వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. (car) కారులో ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు, వైద్య సిబ్బంది, ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ ఛాయానందిని, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ స్రవంతి DDCOP  ప్రిన్సిపాల్ శ్రావ్య స్పందన, DDCON మిస్ సింపుల్, AMS SON ప్రిన్సిపాల్, నల్లకుంట ట్రాఫిక్ S.I దేవదాస్, అయాన్, పిసి కృష్ణ, HG అధికారి TTI బేగంపేట హీరో మోటర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -