end
=
Sunday, January 19, 2025
సినీమాగాడ్ ఫాదర్ గా చిరు:
- Advertisment -

గాడ్ ఫాదర్ గా చిరు:

- Advertisment -
- Advertisment -

మోహన్ రాజా దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాడ్ ఫాదర్ మలయాళంలో ఘనవిజయం సాధించిన లూసిఫర్‌కి అధికారిక రీమేక్. చిరంజీవి హీరోగా 153వ చిత్రమిది. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ డ్రామా. ఇందులో సల్మాన్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరాకు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో ఓ చిత్రంలో బిజీగా ఉన్నారు చిరు. మరోవైపు వెంకీ కుడుముల డైరక్షన్లో ఓ సినిమాను ఖరారు చేశారు చిరు. మారుతి దర్శకత్వంలో నటించేందుకు సిద్దమని ఓ వేదికపై చెప్పారు. గాడ్‌ ఫాదర్ రాకకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ తో తమ అభిమాన హీరో కమ్‌బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -