బంగారం కొనుగోలు చేయాలనే వారికి శుభవార్త. పసిడి రేటు పడిపోయింది. హైదారాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు నేలచూపులు చూశాయి. జూన్ 6న బంగారం ధరలు తగ్గాయి. రూ. 380 పడిపోయింది. 10 గ్రాములకు రూ. 52,090కు పడిపోయింది. 24 క్యారెట్లకు ఈ రేటు వర్తిస్తుంది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 360 దిగొచ్చింది. రూ. 47,740కు తగ్గింది. బంగారం ధరలు (Gold Price) రెండు రోజుల వరుస పెరుగుదల తర్వాత ఈరోజు దిగివచ్చాయి. బంగార ధర తగ్గితే వెండి కూడా పడిపోయింది. వెండి రేటు రూ. 1000 దిగింది. దీంతో కేజీ సిల్వర్ (Silver) రేటు రూ. 67,500కు పడిపోయింది. అలాగే ప్లాటినం విషయానికి వస్తే.. దీని ధర రూ. 25,250 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
కాగా ఈ వారం బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు ఏంటివో తెలుసుకుందాం. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా వెల్లడి కానున్నాయి. ఇన్వెస్టర్లు ఈ అంశాన్ని నిశితంగా గమనిస్తూ ఉన్నారు. సమీప కాలంలో బంగారం ధరల ట్రెండ్‌ను నిర్ణయించేది ఈ అంశమే.ఆర్‌బీఐ మీటింగ్ కూడా జరగబోతోంది. రిజర్వు బ్యాంక్ తీసుకునే నిర్ణయం వల్ల రూపాయి కదలికలు ఆధారపడి ఉంటాయి. ఈ అంశం కూడా దేశీ మార్కెట్‌లో బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. డాలర్ ఇండెక్స్ గత వారం చివరిలో కొద్దిగా క్షీణించింది. కానీ 101 స్థాయికి పైనే ఉంది. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా డాలర్ ఇండెక్స్ తగ్గితే మాత్రం అది బంగారాని మద్దతు ఇస్తుంది. అంటే పసిడి రేటు పెరిగే అవకాశం ఉంది.