end
=
Wednesday, April 23, 2025
వార్తలుజాతీయంల‌క్ష‌ణంగా ల‌క్ష మార్క్ దాటిన పుత్త‌డి !
- Advertisment -

ల‌క్ష‌ణంగా ల‌క్ష మార్క్ దాటిన పుత్త‌డి !

- Advertisment -
- Advertisment -

ఇది ఆల్‌టైం రికార్ట్‌

అంతర్జాతీయ మార్కెట్ల(International Market)లో అనిశ్చితి గోల్డ్ రేట్ల(Gold rates) పెరుగుద‌ల‌(Drastic Hike)కు కార‌ణ‌మైంది. అమెరికా – చైనా మ‌ధ్య ప్రతీకార సుంకాల(Revenge tariffs) విధింపులే ధ‌ర‌ల పెరుగుల‌కు ప్ర‌ధాన కార‌ణం. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం మధ్యాహ్నానికి రూ.లక్షకు చేరుకుంది. ఇది ఆల్ టైం రికార్డ్. 10 గ్రాముల బంగారం ధ‌ర‌ రూ. 1,01,800 ప‌లికింది. ధరలు మరింత పెరుగుతాయని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు (31.10 గ్రాములు)బంగారం ధర 3,467 డాలర్లు పలుకుతున్నది.

 

స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు.

అక్షయ తృతీయపై ప్రభావం ఉంటుందా?
భారతీయ సంస్కృతిలో ఏటా అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఈ నెల 30న అక్షయ తృతీయ. అప్పటికి గోల్డ్ ధరలు ఎలా ఉంటాయో..? అన్న ప్రశ్న ఇప్పుడు మొదలైంది. అప్పటివరకు ధరలు కాస్త తగ్గితే బంగారం కొందామనే ఆలోచనలో కొందరు ఉన్నారు. లేదంటే.. ధరలు పెరుగుతూ పోతే బంగారం అమ్మకాలు కాస్త తగ్గే అవకాశం ఉంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -