end
=
Tuesday, April 22, 2025
వార్తలుజాతీయంప‌సిడి.. ల‌క్ష‌కు మ‌రో ఒక్క అడుగు దూరం
- Advertisment -

ప‌సిడి.. ల‌క్ష‌కు మ‌రో ఒక్క అడుగు దూరం

- Advertisment -
- Advertisment -

బంగారం ధర(Gold rates) సరికొత్త శిఖరాల(Drastic hike)కు చేరుకుంది. ఇప్పటికే రికార్డు స్థాయి(New record)లో కొండెక్కి కూర్చున్న పుత్తడి సోమవారం మరింత ప్రియంగా మారింది. ఒకానొక దశలో సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ. 1,00,016 (3 శాతం జీఎస్టీతో కలిపి) పలికింది. ఆపై కాస్త దిగొచ్చి రూ. 99,900 వద్ద స్థిరపడింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే సోమవారం బంగారం ధర రూ. 2వేలు పెరిగింది. డాలర్ బలహీనపడటం(Down fall of Dollars), అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం ధర రాకెట్ స్పీడ్‌లో పెరిగేందుకు కారణం అవుతున్నాయి.

 

ఈ ఏడాదిలో 10 గ్రాముల బంగారానికి 26 శాతం మేర దాదాపు రూ. 20,800 ధర పెరిగింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు పసిడి ధర 3,405 డాలర్లకు చేరుకుంది. ఇప్పటికే ఓ సారి లక్ష మార్కును క్రాస్ చేసిన కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 99,299 పలుకుతోంది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -