end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంకాంగ్రెస్‌కు శుభవార్త..
- Advertisment -

కాంగ్రెస్‌కు శుభవార్త..

- Advertisment -
- Advertisment -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ శ్రేణులకు సంతోషం కలిగించే మాట చెప్పారు. తాను పార్టీ చెప్పినట్లుగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పార్టీ సీనియర్లతో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయం చెప్పినట్లు ఆ పార్టీ నేత పవన్ బన్సల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ లేఖ రాసిన సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు చెప్పారు.

సోనియా గాంధీ నివాసం 10 జన్‌పథ్‌లో శనివారం జరిగిన సమావేశంలో సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ‘అసమ్మతివాద’ సీనియర్ నేతలు పాల్గొన్నారు. నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ బన్సల్ మాట్లాడుతూ.. పార్టీ చెప్పినట్లుగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. మీరంతా కోరుకున్నట్లుగా పార్టీ కోసం పని చేయడం నాకు ఇష్టమే’ అని రాహుల్ చెప్పినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు ఎవరూ రాహుల్ గాంధీని విమర్శించలేదన్నారు.

ఈ ఏడాది ఆగస్టులో 23 మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సమష్టి నిర్ణయాలు తీసుకోగలిగిన, చురుకైన నాయకత్వం పార్టీకి అవసరమని పేర్కొన్నారు. పార్టీని ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ నేతలు శనివారం జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. రానున్నరోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి తగిన మార్గాల గురించి చర్చించేందుకు మేధోమథనాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

పార్టీ అధ్యక్ష పదవితో సహా, సంస్థాగత ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోందని పవన్ చెప్పారు. దీని కోసం సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ కృషి చేస్తోందన్నారు. మనమంతా పెద్ద కుటుంబమని సోనియా గాంధీ అన్నారన్నారు. రాహుల్ గాంధీ కూడా ఇదేవిధంగా మాట్లాడారని చెప్పారు. అసమ్మతివాదులతో సహా పార్టీ నేతలెవరికీ రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల అభ్యంరాలు లేవని స్పష్టం చేశారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో రాహుల్ గాంధీ ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగారు. దీంతో పార్టీ సారథ్య బాధ్యతలను సోనియా గాంధీ మళ్లీ చేపట్టిన విషయం తెలిసిందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -