end

ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..

దసరా పండుగకు ముందు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 3,737 కోట్లు బోనస్‌గా చెల్లించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల 30 లక్షల మంది నాన్ గెజిటెడ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వెల్లడించారు. బోనస్‌ వల్ల వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు కలుగుతుందని మంత్రి తెలిపారు. విజయదశమి పర్వదినాన సింగిల్‌ ఇన్‌స్టాల్‌మెంట్ కింద ఉద్యోగుల ఖాతాల్లో బోనస్‌ అమౌంట్ జమ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

Exit mobile version