తెలంగాణ సర్కారు దీపావళి పర్వదినాన జీహెచ్‌ఎంసీ కార్మికులకు శుభవార్త చెప్పింది. వారి నెలవారీ జీతాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం కార్మికుల జీతం రూ. 14,500. కాగా, దీనికి అదనంగా మరో రూ. 3వేలు పెంచింది టీఎస్ గవర్నమెంట్. పెంచిన జీతంతో కలిపి మొత్తం రూ. 17,500లకు చేరనుంది. క్షేత్రస్థాయిలో వారు చేసే పనికి ఈ జీతం కూడా తక్కువే అయినప్పటికీ.. వారి గౌరవార్థం జీతం పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ సమయంలో వారి కృషి మరవలేనిదనీ.. అప్పుడే కాదు, ఎల్లకాలం వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ స్వచ్ఛ హైదరాబాద్‌కు నిర్విరామంగా కృషి చేస్తున్నారని ప్రభుత్వం వారి సేవలను కొనియాడింది.
జీతాల పెంపుతో జీహెచ్‌ఎంసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. మా పనికి దగ్గ ప్రతిఫలం లభిస్తోందని వారు ఈ సందర్భంగా తెలిపారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీర్, మేయర్ రామ్మోహన్‌కు వారు ధన్యవాదాలుతెలిపారు.