end
=
Tuesday, April 1, 2025
వార్తలురాష్ట్రీయంHyderabad:హైదరాబాద్ నగర వాసులకు గుడ్‌ న్యూస్‌
- Advertisment -

Hyderabad:హైదరాబాద్ నగర వాసులకు గుడ్‌ న్యూస్‌

- Advertisment -
- Advertisment -

  • మెట్రో సెకండ్‌ ఫేజ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌
  • భూమి పూజ చేయనున్న కేసీఆర్‌


హైదరాబాద్‌ (Hyderabad) నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) శుభవార్త తెలిపింది. గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న మెట్రో (Hyderabad Metro Rail) సెకండ్‌ ఫేజ్‌ పనులు ప్రారంభంకానున్నాయి. మైండ్‌ స్సేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ వరకు (From Mindsays Junction to Shamshabad Airport) మెట్రోను పొడగించనున్నారు. రూ. 6,250 కోట్లతో చేపట్టనుండగా 31 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం ఉండనుంది. మెట్రో సెకండ్ ఫేజ్‌ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిసెంబర్‌ 9న శంకుస్థాపన చేయనున్నారు.

ఈమెట్రో సెకండ్‌ ఫేష్‌ అందుబాటులోకి వస్తే ఎయిర్‌ పోర్ట్‌ వెళ్లే ప్రయాణికులకు ఉపయోగపడనుంది. ఇదిలా ఉంటే మెట్రో సెకండ్ ఫేస్‌ విషయమై నవంబర్ 14న మంత్రి కేటీఆర్‌ (KTR) కేంద్ర ప్రభుత్వానికి లేఖ (Letter to Central Govt) రాసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి కేంద్రాన్ని నిధులు ఇవ్వాలని కోరారు. తొలి ఫేస్‌లాగే దీనిని కూడా పీ.పీ.పీ (PPP) మోడల్‌లోని నిర్మాణం చేపడతారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మెట్రో సెకండ్ ఫేస్‌లో భాగంగా బీహెచ్‌ఎల్‌(BHEL)S నుంచి లక్డీకపూల్‌ (Lakdikapool) కు కూడా మెట్రో విస్తరణ చేపట్టనున్నారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం హైదరాబాద్‌లో మెట్రోలో రోజుకు 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కోవిడ్‌కంటే ముందే 5 లక్షల మంది ప్రయాణించగా ఇప్పుడా సంఖ్య తగ్గింది. ఇక ఎయిర్ పోర్ట్‌కు ప్రస్తుతం బస్సు లేదా క్యాబ్‌లపై ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉంది. అయితే మెట్రో అందుబాటులోకి వస్తే ప్రయాణికులు వేగంగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే అవకాశం లభిస్తుంది.

(Maharashtra:బల్లార్షా రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -